వైరల్ వీడియోలో వరమాల వేడుకలో ఈ దంపతులు వేదికపై నిలబడి పూల దండలు మార్చుకోవడం మనం చూడవచ్చు. ఈ సమయంలో వరుడు వధువుతో ఏదో గుసగుసలు మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నట్లు ముందుకు కదిలాడు. అలా నటిస్తూ ఆమెను చాలాసార్లు ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. కానీ వధువు వెనుకకు కదిలింది. బహిరంగంగా అతడు చేయాలనుకుంటున్న రొమాన్స్ వల్ల ఆమె చాలా అసౌకర్యంగా ఫీల్ అయింది.
కానీ వరుడు వధువు చెంపను ముద్దుపెట్టుకునే వరకు అలా ట్రై చేశాడు. పెళ్లికి విచ్చేసిన అతిథులందరూ వరుడి ధైర్యసాహసాలకు ఆశ్చర్యపోయారు. వైరల్ వీడియో చూసిన కొంతమంది నెటిజన్లు సైతం షాక్ అయ్యారు. కొందరు మాత్రం వరుడు, వధువుతో పాటు పెళ్లి ఆచారాల పట్ల అగౌరవంగా ప్రవర్తించాడని విమర్శించారు. వధువు అసౌకర్యాన్ని ప్రదర్శించి వేదికపై నుంచి వెళ్లడానికి సిద్ధమైనప్పుడే వరుడు ముద్దు పెట్టుకోకుండా ఆగి ఉండాల్సిందని కొందరు అన్నారు.
అతని ప్రవర్తన ఆమోదయోగ్యం కానిదని, అందరి ముందు ముద్దు పెట్టుకోవడం తగనిదని అభిప్రాయపడ్డారు. అయితే ఇంకొందరు మాత్రం వరమాల వేడుకలో ఇలాంటివి కామన్ అని కామెంట్లు పెట్టారు. ధీరజ్ కౌశిల్ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేయగా, దీనికి లక్షల్లో వ్యూస్ వచ్చాయి.