జై భారత్ నేషనల్ పార్టీ అధినేత లక్ష్మీనారాయణ ప్రకటించారు. తాజాగా ఆయన విశాఖలో ఉత్తరాంధ్ర పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయం కోసమే యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయితే సీబీఐ మాజీ జేడీ, భారత్ పార్టీ అధ్యక్షులు వీవీ లక్ష్మీనారాయణ మనసు మార్చుకున్నారు.
ఎన్నికల్లో పోటీచేస్తానని ప్రకటించిన ఆయన పోటీపై కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నానని తెలిపారు. విశాఖ ఎంవీపీకాలనీ సెక్టారు-10లోని ఉత్తరాంధ్ర పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. గతంలో జనసేన పార్టీ తరఫున తాను విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశానని, ప్రస్తుతం తమ పార్టీ నిర్ణయం మేరకు విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నానని అన్నారు.
ఫ్రంట్ తరఫున లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఐఏఎస్ అధికారి జీఎస్ఆర్కేఆర్ విజయ్ కుమార్ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి పోటీ చేస్తారని, ఆల్ తెలుగు ప్రజా పార్టీ నాయకుడు డాక్టర్ కె శివ భాగ్య రావు బాపట్ల నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారని, ప్రబుద్ధ రిపబ్లిక్ అండ్ పార్టీ అధ్యక్షుడు దాసరి చెన్నకేశవులు కొండేపి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారని లక్ష్మీనారాయణ వివరించారు. రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయం కోసమే యునైటెడ్ ఫ్రంటు ఏర్పాటు చేశామన్నారు.