ఒకపార్టీ నేతలు మరో పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ దుమ్మెత్తి పోసుకొంటున్నారు. ఇటీవల కాలంలో పవన్ కల్యాణ్‌ను కొడాలి నాని ఓ రేంజ్‌లో ఆరోపణలు, విమర్శలు చేస్తూ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. అయితే వారిద్దరూ ఒకే వేదికపైన కనిపించడం ఆసక్తికరంగా మారింది. పవన్ కల్యాణ్ ఉన్న స్టేజ్‌పై కొడాలి నాని ఎదురైన అనుభవం గురించి నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు.
అయితే విజయవాడ దివంగత నేత వంగవీటి రంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ వివాహం.. కృష్ణా జిల్లా పోరంకిలో ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. ఇక ఈ పెళ్లి వేడుకకు రాజకీయనాయకులు, అభిమానులు భారీగా తరలి వచ్చారు. అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఈ వివాహానికి హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ వేదిక దగ్గరకి వచ్చే సమయానికి.. చుట్టూ అభిమానులతో ఒక గందరగోళ తోపులాట జరిగింది.
ఈక్రమంలో అక్కడే ఉన్న కొడాలి నాని కింద పడిపోయే పరిస్థితి జరిగింది. ఈ తోపులాటలోనే మరో రాజకీయనేత వల్లభనేని వంశీ కూడా బాగా ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియో వైపు మీరుకూడా ఒక లుక్ వేసేయండి.