మంత్రి రోజా పై బండారు చేసిన వ్యాఖ్యలైన వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి రోజా పైన టీడీపీ నేత బండారు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలోని అమరావతి లోక్ సభ సభ్యురాలు, నటి నవనీత్ కౌర్, రాధిక, ఖుష్బూ సహా పలువురు… టీడీపీ నేత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అయితే మంత్రి రోజా వ్యవహారంలో సినీతారల నుంచి స్పందన మొదలైన తర్వాత ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది.
చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత బాబు కుటుంబ సభ్యులు, సతీమణి, కోడల బ్రహ్మణిల గురించి రోజా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బండారు శృతి మించారు. రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగతంగా ఆమెను కించపరిచేలా బండారు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ తరపున కేవలం మహిళా కమిషన్ ఛైర్మన్ మాత్రమే అధికారికంగా స్పందించారు. బండారు వ్యాఖ్యల తర్వాత వాసిరెడ్డి పద్మ డీజీపీకి చర్యలు తీసుకోవాలని లేఖ రాయడంతో బండారును గత వారం నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆయన హైకోర్టును ఆశ్రయించారు. చివరకు ఆయనకు బెయిల్ మంజూరైంది. ఆ తర్వాత కూడా ఈ వ్యవహారం సద్దుమణగలేదు. రోజాపై బండారు చేసిన వ్యాఖ్యల విషయంలో టీడీపీ కొంత ఆత్మరక్షణలో పడింది. రోజా గతంలో తనను అలాగే అవమానించదంటూ తెలుగు మహిళ అధ్యక్షురాలు అనిత ఆరోపించారు.