రాబోయే ఎన్నికల్లో అంబటి రాంబాబు ఓడిపోతే జబర్దస్త్ షోలకు పనికి వస్తారని విమర్శించారు. అనంతపురం జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన పృథ్వీ మీడియాతో మాట్లాడారు. అయితే 30 ఇయర్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్.. హాస్య నటుడిగా, ప్రతినాయకుడిగా ఇన్నాళ్లు అలరిస్తూ వచ్చారు.
ఇప్పుడు దర్శకుడిగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ‘కొత్త రంగుల ప్రపంచం’ అనే టైటిల్ తో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన కూతురు శ్రీలు హీరోయిన్ గా నటిస్తున్నారు. క్రాంతి కృష్ణ హీరోగా, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రలో నటిస్తూనే ఈ చిత్రాన్ని తెరకెక్కిచారు. నేడు ఈ మూవీ ట్రైలర్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతులు మీదుగా రిలీజ్ చేశారు.
సినిమా టైటిల్ కి తగ్గట్టే ట్రైలర్ లో చాలా రంగులు కనిపించాయి. సినిమా ఇండస్ట్రీ నేపథ్యంతో సాగే ఈ చిత్రాన్ని హార్రర్ థ్రిల్లర్ గా ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ ట్రైలర్ ని రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్ మూవీ టీంకి తన విషెస్ తెలియజేశారు. మరి ఆ కొత్త రంగుల ప్రపంచం ట్రైలర్ ని మీరు కూడా చూసేయండి.