జగన్‌ను ఓడించడం తన ఒక్కడి వల్ల కాదని చెప్పిన పవన్.. వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనని ప్రతిజ్ఞ చేసి మరీ ఎన్నికల బరిలో నిలిచి ఘన విజయం సాధించారు. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ అభ్యర్ధులు విజయం సాధించారు.తొలిసారి ఎమ్మెల్యే అయిన పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ మూడో భార్య అన్నా లెజ్నోవా సెంటర్ ఆఫ్ ది ఎట్రాక్షన్‌గా మారారు. అయితే అన్నా లెజినోవా 1980 లో రష్యాలో జన్మించారు. ఆమె రష్యాలో నటిగా, మోడల్‌గా రాణించారు. ఈ క్రమంలో 2011లో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘తీన్మార్’ సినిమాలో లెజినోవాకు ఒక చిన్నపాత్ర దక్కింది. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా ఇద్దరికి పరిచయం పెరిగి ప్రేమలో పడ్డారు. ఈ ఆన్‌సెట్ ప్రేమాయణం పెళ్లికి దారితీసింది.
రెండేళ్లపాటు డేటింగ్ చేసిన అనంతరం 2013 సెప్టెంబర్ 30న పవన్, లెజినోవాలు పెళ్లి చేసుకున్నారు. పవన్, లెజినోవా దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. కుమార్తె పేరు పోలెనా అంజనా పవనోవా, కొడుకు పేరు మార్క్ శంకర్ పవనోవిచ్. వీరిలో అంజనా పవనోవా.. అన్నా లెజినోవా మొదటి వివాహం ద్వారా జన్మించింది. శంకర్ పవనోవిచ్ మాత్రం పవన్, లెజినోవాల సంతానం. అయితే అంజనా పవనోవాను పవన్ కళ్యాణ్ దత్తత తీసుకున్నారు. ఇప్పుడు పిల్లలిద్దరూ కలిసే పెరుగుతున్నారు. అయితే, అన్నా లెజినోవా కేవలం మోడలింగ్ కేరీర్‌తో మాత్రమే సరిపెట్టుకోలేదని, సింగపూర్‌లో ఆమెకు హోటల్స్ ఉన్నాయని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. లెజినోవాకు రష్యా, సింగపూర్‌లో భారీగా ఆస్తులున్నాయని కూడా రూమర్స్ వెల్లువెత్తుతున్నాయి.
ఆమె ఆస్తుల విలువ దాదాపుగా రూ.1,800 వందల కోట్లు ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అన్నా లెజినోవాను వివాహం చేసుకున్న అనంతరం పవన్ కళ్యాణ్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. అప్పటికే ఆయన రెండు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకోవడం, తర్వాత మూడో పెళ్లి చేసుకోవడంపై చాలామంది విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ 1997లో 19 ఏళ్ల నందినిని వివాహం చేసుకున్నారు. 2008లో వారు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2009లో పవన్ కళ్యాణ్ నటి రేణు దేశాయ్‌ని రెండో వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు అకీరా నందన్, ఆధ్యా ఉన్నారు. అయితే 2012లో రేణు దేశాయ్‌కి కూడా పవన్ డైవోర్స్ ఇచ్చారు.
ఇదిలావుంటే మూడో భార్య అన్నా లెజినోవాతో కూడా పవన్ కళ్యాణ్‌కు అభిప్రాయ బేధాలు వచ్చాయని, ఇద్దరు విడిగా ఉంటున్నారని ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. నాగబాబు కొడుకు వరుణ్‌తేజ్ ఎంగేజ్‌మెంట్‌కు గానీ, చిరంజీవి మనుమరాలు.. రామ్‌చరణ్, ఉపాసనల కుమార్తె ఊయల ఫంక్షన్‌కుగానీ అన్నా లెజినోవా రాకపోవడం, పవన్ కళ్యాణ్ ఒక్కరే హాజరవడం ఈ ప్రచారానికి బలం చేకూర్చింది. ఈ నేపథ్యంలో లెజినోవా ఎన్నికల సందర్భంగా తన భర్తతో కలిసి ప్రజల్లోకి వచ్చారు. భర్తకు మద్దతుగా నిలిచి ఆయన ఘన విజయంలో పాలుపంచుకున్నారు. దాంతో తనకు, తన భర్తకు మధ్య గొడవలు ఉన్నాయని జరుగుతున్న ఉత్తదేనని చెప్పకనే చెప్పారు.