చంద్రబాబు అరెస్టుపై సినీ ఇండస్ట్రీ స్పందించకపోవడంపై పవన్ కళ్యాణ్ కీలక వాక్యాలు చేశారు. మంగళగిరిలో మాట్లాడుతూ… ‘ఇండస్ట్రీలోని వారు పొలిటికల్ హీట్ ను తీసుకోలేరు. చాలా ఒత్తిడి ఉంటుంది. అందుకే స్పందించడానికి భయపడుతున్నారు. ఎవరైనా మాట్లాడితే వైసిపి నేతలు టార్గెట్ చేస్తారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆయనకు వ్యతి రేకంగా సినిమాలు తీసిన కక్ష సాధింపు జరగలేదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు’ అని పేర్కొన్నారు.
అయితే వైసీపీ ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్. మంగళగిరి పార్టీ ఆఫీసులో మాట్లాడిన పవన్.. మూడు అంశాలపై క్లారిటీ ఇచారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలపై అక్రమ కేసులతో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని.. ఈపరిస్థితిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు పవన్. టీడీపీతో పొత్తు విషయం బీజేపీతో మాట్లాడి.. డిల్లీలో ప్రకటించాలి అనుకున్నా.. వైసీపీ తీరు వల్లే రాజమండ్రిలో ప్రకటించాల్సి వచ్చిందని చెప్పారు.
తెలంగాణలో నోటిఫికేషన్ వచ్చాక పొత్తులపై కోఆర్డినేషన్ కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు పవన్. ఇప్పటికి జనసేన ఎన్డీఏలోనే ఉందని స్పష్టం చేశారు పవన్. కూటమిలో బీజేపీ కచ్చితంగా కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే జగన్ ఎన్డీఏలో లేరని.. కేవలం ఆయనను ఒక రాష్ట్ర సీఎంగానే కేంద్రం గౌరవిస్తుందని చెప్పారు పవన్. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారమే నిధులు విడుదల చేసిందని బీజేపీ తనతో చెప్పిందన్నారు పవన్.