పవన్ కళ్యాణ్ 1968 లేదా 1971 సెప్టెంబరు 2 న కొణిదెల వెంకటరావు, అంజనాదేవి దంపతులకు మూడవ కుమారునిగా ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల లో జన్మించాడు. ఇతనికి ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నయ్యలు. అయితే ప్రస్తుతం పవనిజం నడుస్తోంది. తనదైన స్టైల్, మ్యానరిజమ్స్ తో యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. మరేస్టార్ కు దక్కని విధంగా తిరుగులేని ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి వచ్చి.. అన్నను మించిన తమ్ముడిగా ఎదిగాడు. ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నాడు.
రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్న వరుసగా సినిమాలు చేస్తూ తన ఫ్యాన్సును అలరిస్తున్నాడు. అలాంటి పవన్ కళ్యాణ్ గురించి చాలా మందికి తెలియని ఓ సీక్రెట్ ఉంది. ఓ సమయంలో ఆయన ఓ వ్యాధితో నరకయాతన అనుభవించాడట. ఏంటి మా పవన్ కు వ్యాధా.. అవును మీరు చదివింది నిజమే.. కాకపోతే విషయం ఇప్పటిది కాదు. పవన్ స్కూల్ డేస్ నాటిది. తాను చదువుకుంటున్న సమయంలో పవన్ కళ్యాణ్ ఆస్తమా బారిన పడ్డారు. ఆ వ్యాధి వల్ల ఆయన చాలా ఇబ్బంది పడ్డారట. ఆస్తమాతో తరచూ హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సి వచ్చేదట. దాంతో స్కూల్ కు సరిగా వెళ్లలేకపోయేవాడట. అంతేకాకుండా తనకు ఫ్రెండ్స్ ఉండేవారు కాదట.
మరోవైపు పరీక్షల ఒత్తిడితో పవన్ డిప్రెషన్లోకి నెట్టేశాయట. ఆ డిప్రెషన్ లోనే పవన్ కళ్యాణ్ ఒకానొక సమయంలో సూసైడ్ చేసుకోవాలని కూడా అనుకున్నాడట. కానీ, ఎలాగోలా ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడ్డాడు. తన ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి పుస్తకాలు చదవడం మొదలు పెట్టాడు. అంతేకాకుండా ఏ విషయం అయినా సొంతంగా నేర్చుకోవడం అలవాటు చేసుకున్నాడు. కొద్ది రోజుల ట్రీట్ మెంట్ తర్వాత ఆయన ఆస్తమాను జయించగలిగాడు. మ్యూజిక్, మార్షల్ ఆర్ట్స్ లో నైపుణ్యం సాధించి.. నెమ్మదిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగాడు.