సౌత్ లో సంచలనం సృష్టించిన లవ్ బర్డ్స్ నరేష్, పవిత్ర. సాధారణంగా చిత్ర పరిశ్రమలో ప్రేమ కథలు, వ్యక్తిగత వివాదాలు సహజమే. కానీ వీళ్లిద్దరి వ్యవహారం వేరు. 60 ప్లస్ లో ఉన్న నరేష్.. 40 ప్లస్ లో ఉన్న పవిత్ర మధ్య ఘాటు ఎఫైర్ మొదలయింది. అయితే తాజాగా నరేష్, పవిత్ర లోకేష్ పెళ్లి వ్యవహారంపై నరేష్ కొడుకు నవీన్ తొలిసారి కీలక వ్యాఖ్యలు చేశారు. “మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా చాలా ఇండిపెండెంట్ గా వ్యవహరిస్తారు. ఎవరికి ఏది కావాలో దాని కోసం ప్రయత్నిస్తారు. ఏ నిర్ణయం తీసుకున్నా అందరం పీస్ ఫుల్ గా ఉండాలి అనుకుంటారు. మనం చేసే ప్రతి పని కరెక్ట్ గా ఉండాలనే రూల్ ఏమీ లేదు. చాలా సార్లు తప్పులు చేస్తుంటాం.
మా నాన్న కూడా తప్పు చేశాడు అనుకుంటున్నాను. తప్పు చేశారు అనడం కంటే చేసిన తప్పులకు సొల్యూషన్ కనుకొన్నారు అనుకుంటున్నాను. గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకుని బెటర్ గా లైఫ్ ను లీడ్ చేయాలి అనుకుంటున్నారేమో. ఆయనకు ఏది మంచిది అనిపిస్తే అది చేస్తారు. నా ఫీలింగ్ ఏంటంటే? నేను చెడుగా ఏమీ ఫీల్ కావడం లేదు. ప్రపంచం ఏం అనుకుంటుంది? అని ఆలోచించి మనం బతకాలంటే కష్టం. అందుకే, మనకు నచ్చినట్లుగా ఉండాలి. మా నాన్న తీసుకున్న నిర్ణయం పట్ల నేను గర్వంగానే ఉన్నాను. ఆయన తన లైఫ్ లో సంతోషంగా ఉన్నారా? లేదా? అనేదే నాకు ముఖ్యం. ఆయన హ్యాపీగా ఉన్నారు.
నేను కూడా హ్యాపీగా ఉన్నాను” అన్నారు. “మానాన్న పెళ్లి గురించి మేం ఏం అనుకుంటున్నాం అనేది చాలా ముఖ్యం. బయటి వాళ్లు ఏం మాట్లాడుకుంటున్నారు? అనేది మాకు ముఖ్యం కాదు. ఎందుకంటే అది మా ఓపీనియన్ కాదు. బయటి వాళ్ల ఒపినియన్స్ కన్సిడర్ చేయలేం. ఆయన నిర్ణయం, ఆయన సమస్య, ఆయనే చూసుకుంటారు. ఆయన కొడుకుగా నా నిర్ణయాన్ని తను అడిగితే అప్పుడు చెప్తాను. నాకంటే ఆయనే తన లైఫ్ ను బాగా చూసుకోగలడు. పవిత్ర లోకేష్ గారు నాకు చాలా కాలంగా తెలుసు. చాలాసార్లు మాట్లాడాను. తను చాలా మంచి వ్యక్తి. ఆమె లాంటి వ్యక్తులు చాలా తక్కువగా ఉంటారు. ఎప్పుడైనా తను చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఆమెను పవిత్ర గారు అని పిలుస్తాను” అని నవీన్ చెప్పారు.