పసివాడి ప్రాణం చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉంది ఏం చేస్తుందో తెలుసా..?

‘పసివాడి ప్రాణం’ చిరంజీవి నటనతో పాటు ఒక క్యూట్‌ చిన్నారి యాక్టింగ్ హైలెట్‌గా నిలిచింది. ఎలాంటి మాటలు లేకుండా కేవలం ఎక్స్‌ప్రెషన్స్‌తోనే అందరినీ ఆకట్టుకుంది. ఆ ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌ ఎవరో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం తెలుగు, తమిళ్‌, మలయాళ టీవీ సీరియల్స్‌లో నటిస్తోన్న నటి సుజితా ధనుష్‌. ఇకపోతే ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన అబ్బాయి కూడా అప్పుడు పెద్ద ఎత్తున ఫేమస్ అయ్యారు. నిజానికి ఈ సినిమాలో అబ్బాయి పాత్రలో నటించింది అమ్మాయి.

పసివాడి ప్రాణం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ అమ్మాయి ప్రస్తుతం ఏం చేస్తుంది ఎలా ఉంది అనే విషయానికి వస్తే..మెగాస్టార్ పసివాడి ప్రాణం సినిమాలో నటించినది మరెవరో కాదు బుల్లితెరపై వదినమ్మ సీరియల్ ద్వారా అందరినీ సందడి చేస్తున్న బుల్లితెర నటి సుజాత. ప్రస్తుతం ఈమె వరుస టీవీ సీరియల్స్ తో ఎంతో మంచి గుర్తింపు పొందారు.ఈమె ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని పసివాడి ప్రాణం సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సినిమా 5 భాషలలో తెరకెక్కిన తానే చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించానని సుజాత తెలియజేశారు.

పసివాడి ప్రాణంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈమె చిరంజీవి నటించిన జై చిరంజీవ సినిమాలో మెగాస్టార్ కు చెల్లెలు పాత్రలో కూడా నటించారు.సుజాత కేవలం చిరంజీవి సినిమాలో మాత్రమే కాకుండా వెంకటేష్ నాగార్జున బాలకృష్ణ వంటి హీరోల సినిమాలలో కూడా నటించారు. ప్రస్తుతం ఈమె బుల్లితెరపై సీరియల్స్ లో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *