సంఘటన తర్వాత ఓ విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే ఆమెనే ప్రముఖ హీరోయిన్ పార్వతి నాయర్. మలయాళ సినిమాలతో హీరోయిన్ గా పరిచయమైన ఆమె.. ప్రస్తుతం కన్నడ, తమిళ్ లో మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. అయితే సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్గా ఉంటూ ఘాటు అందాలు ఆరబోసే పార్వతిపై తాజాగా సంచలన ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆమె ఇంటి గుట్టు రట్టయిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ పార్వతి ఇంట్లో ఏం జరిగింది.. ఆమెపై నెటిజన్లు ఎందుకు ఫైర్ అవుతున్నారు అంటే..? పార్వతి నైర్ ఇంట్లో పని చేస్తున్న పనిమనిషి ఆమెపై సంచలన ఆరోపణలు చేశాడు. ఈ బోల్డ్ బ్యూటీ తనపై లైంగిక వేధింపుల కేసు పెడతానని బెదిరిస్తోందని ఆరోపించాడు. గత నెలలో పారు ఇంట్లో రూ.9 లక్షల విలువైన వాచ్లు, ఒక ఐఫోన్, రూ.2 లక్షల విలువైన ల్యాప్టాప్ చోరీ అయ్యాయట.

ఇక పార్వతికి ఆ పనిమనిషిపైనే డౌట్ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ఆ పనిమనిషి స్పందిస్తూ పార్వతిపై సంచలన ఆరోపణలు చేశాడు. ఆమె ఇంట్లో ఎవరో చోరీ చేస్తే తనపై నింద మోపుతోందని.. తనని పలుమార్లు కొట్టడమే కాకుండా.. ముఖంపై ఉమ్మేసిందని ఆరోపించాడు. ఇంకా లైంగిక వేధింపుల కేసు పెడతానని బెదిరిస్తున్నట్లు వాపోయాడు. పార్వతి ఇంట్లో చోరీ కేసుపై పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు.