పరిటాల రవి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, అనంతపురం జిల్లా పెనుగొండ మాజీ శాసన సభ సభ్యుడు, తెలుగుదేశం పార్టీలో ప్రముఖ నాయకుడు. 2005 లో ప్రత్యర్థుల దాడిలో మరణించాడు. అయితే రాయలసీమ రాజకీయ నాయకుడు, నక్సలైట్, ఫ్యాక్షనిస్టు, సామాజిక సేవకుడు. మేధావి, దుస్సాహసికుడు, ఒంటెత్తు తత్వమనిషి, ఆదర్శ నాయకుడు, స్వాప్నికుడు, ప్రేమికుడు ఇలా ఎవరికి వారే పరిటాల రవి స్వభావం గురించి చెప్పే మాటలు. ఏళ్లు గడుస్తున్నా..ఆయన గురించి సీమ ప్రజలు మర్చిపోరు.
మర్చి పోలేరు. అంతగా పరిటాల రవితో వారికి బంధం పెనవేసుకుపోయింది. పోకిరి సినిమాలో మహేష్ బాబు కోసం విలన్ ప్రకాష్ రాజ్..నాజర్ ను ప్రశ్నించిన దృశ్యాన్ని గుర్తు చేసుకోవచ్చు. నా కొడుకు ఎక్కడున్నాడో చెప్పినా నువ్వు చంపుతావు. చెప్పకపోయినా చంపుతావు. నా చావు నాకు తెలుస్తోంది. ఇవాళ నా డెత్ డే. రేపు నీ డెత్ డే అంటూ నాజర్ పాత్ర చెబుతుంది. ఇందుకు విలన్ పాత్రలో ఉన్న ప్రశాష్ రాజ్ బెస్టాఫ్ లక్ చెబుతాడు. అచ్చం అలా కాకపోయినా చావు గురించి ముందే తెలుసుకుంటాడు పరిటాల రవి. చనిపోయేటప్పుడు అదే మాట చెబుతాడు. చంపడం తప్ప నువ్వేం చేయలేవని సైగ చేస్తూ ప్రాణాలొదిలాడంటారు.
ఇప్పటికీ ఆ మాటలే చెబుతారు అక్కడున్న వాళ్లు. అది జనవరి 24, 2005. మధ్యాహ్నాం 2.10 నిమిషాలు. అనంతపురంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి బయటకు వచ్చాడు పరిటాల రవీంద్ర. ఇద్దరు గన్ మెన్లు ఉన్నారు. అంతే రవిపై ఒక్కసారిగా బుల్లెట్ల వర్షం కురిసింది. మోకాళ్లలో రెండు, ఛాతిలో రెండు, పక్కటెముకల్లో రెండు. చివరిగా గుండెలో ఒకటి. ఏం జరుగుతుందో ఆలోచించే లోపే ఏడు బుల్లెట్లు. పరిటాల శరీరాన్ని చిద్రం చేశాయి. రక్తం ధారలా కారింది. నన్ను చంపబోతున్నావని తెలుసు. పిరికి పందా..నన్ను చంపుతున్నావా అంతే కదా..అవే ఆయన ఆఖరి మాటలని అభిమానులు చెప్పుకునే మాట.