చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఇష్టంగా తినే వాటిల్లో పానీ పూరి ఒకటి. రోడ్డుకు పక్కన పానీ పూరి బండి కనిపిస్తే చాలు టక్కమని ఆగిపోతాము. ఆ పక్కన ఉన్న పరిసరాలు గాని ఆ బండి గానీ నీట్ గా ఉన్నాయా లేవా అని కూడా చూసుకోకుండా ప్లేట్ల మీద ప్లేట్లు పానీ పూరి లాగించేస్తాము. అయితే ఇక రోడ్ల పక్కన కనిపించే ప్రతిదీ కూడా అస్సలు తినకూడదు.. తింటే ఖచ్చితంగా ఎన్నో ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురవుతాయి.
కానీ ఎందుకో మనం ఇవన్నీ తెలిసినా కూడా వెళ్లి వాటినే తినడానికి చాలా ఎక్కువగా ఇష్టపడతాం. కానీ పానీ పూరీ, గోల్గప్పలను ముఖ్యంగా వర్షాకాలం ఇంకా శీతాకాలం సీజన్‌లో కనుక తింటే ఖచ్చితంగా టైఫాయిడ్, ఇంకా అలాగే అనేక ఇతర సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు.వర్షాకాలంలో అయితే ఎన్నో రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాంటి వ్యాధులలో ఖచ్చితంగా కూడా టైఫాయిడ్ అనేది చాలా ముఖ్యమైనదనే చెప్పుకోవాలి. తెలంగాణలో టైఫాయిడ్ రోగుల సంఖ్య రోజు రోజుకి చాలా వేగంగా పెరుగుతోంది.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్ట్రీట్ ఫుడ్ పానీ పూరీని దీనికి పూర్తి బాధ్యతగా పరిగణించడం జరిగింది.ఇక మే నెలలో తెలంగాణలో సుమారు 27,00 టైఫాయిడ్ కేసులు అనేవి నమోదయ్యాయి. ఇంకా అలాగే అదే సమయంలో, జూన్ నెలలో మొత్తం 2752 కేసులు నమోదయ్యాయి. పానీ పూరీ వల్ల టైఫాయిడ్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉండటమే కాకుండా ఖచ్చితంగా ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉందని చాలా మంది వైద్యులు కూడా పేర్కొన్నారు.