నన్ను కాపాడండన్నా..చంపేస్తా అంటున్నారు.. పల్లవి ప్రశాంత్ ఆవేదన.

టైటిల్ విన్నర్ ప్రకటన తర్వాత అమర్ దీప్ అభిమానులు, పల్లవి ప్రశాంత్ అభిమానులు బాహాబాహీకి దిగారు. ఈ క్రమంలో తెలంగాణ ఆర్టీసీ బస్సులపై తమ ప్రతాపాన్ని చూపించారు. ఈ దాడిలో 6 బస్సుల అద్ధాలు ద్వంసం అయ్యాయి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్‌ లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఎవరో చేసిన దాడులకు ప్రశాంత్ ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని కొందరు ప్రశ్నిస్తున్నారు. కానీ ఆ రోజు ప్రశాంత్ కూడా నిర్లక్ష్యంగా వ్యహరించాడు.

అయితే పోలీసులు గొడవ జరిగే వైపు రావద్దు అని .. వెనుక గేట్ నుంచి బయటకు పంపించారు. అయితే ప్రశాంత్ వారి ఆదేశాలను పట్టించుకోలేదు. కారులో గొడవ జరిగే ప్రాంతానికి చేరుకోవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. దీంతో ప్రశాంత్ పై సుమోటోగా కేసు నమోదు చేసారు. తాజాగా ఈ కేసు పై హైకోర్టు న్యాయవాది డాక్టర్ కే రాజేష్ కుమార్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ ‘ ప్రశాంత్ పై కక్ష సాధింపు చర్యలు తగవని చెప్పారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదు.

ప్రశాంత్ పై కేసు నమోదు చేశారు .. కానీ ఇప్పటి వరకు కనీసం నిందితుడికి FIR కాపీ ఇవ్వడం లేదు. ఈ కేసులకు భయపడి ప్రశాంత్ పరారీలో ఉన్నాడు. దీంతో FIR కాపీ కోసం జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ ను నేను సంప్రదించాను. కానీ ఆయన మాత్రం FIR కాపీ కోసం కుటుంబ సభ్యులు రావాలని తెలుపుతున్నారు. కేసు ఏదైనా సరే FIR కాపీని పబ్లిక్ డొమైన్ లో పెట్టాల్సిన భద్యత పోలీసులకు ఉంది. FIR కాపీ ఉంటేనే ప్రశాంత్ కి బెయిల్ కి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది అని అన్నారు.

ప్రస్తుతం పోలీసులు ఆ కాపీ ఇవ్వకపోవడంతో బెయిల్ దరఖాస్తు చేసుకోలేకపోతున్నాం. ఈ కేసులో పల్లవి ప్రశాంత్ పాత్ర ఏంటో FIR కాపీ చూస్తేనే తెలుస్తుంది. ‘ అని హైకోర్టు న్యాయవాది కే రాజేష్ కుమార్ వెల్లడించారు. కాగా పల్లవి ప్రశాంత్ నేను ఎక్కడికీ పారిపోలేదంటూ వీడియో విడుదల చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *