లక్షల్లో డబ్బు పోగొట్టుకున్న పల్లవి ప్రశాంత్. ప్రశాంత్ ఎలాంటివాడో చెప్పిన హీరో శివాజీ.

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే తర్వాత పల్లవి ప్రశాంత్ అభిమానులు అమర్‌దీప్ చౌదరి ఫ్యామిలీపై దాడి చేసిన విషయం తెలిసింది. అన్నపూర్ణ స్టూడియో నుంచి బయటకు వస్తున్న సమయంలో కారును ధ్వంసం చేశారు. ఆ తర్వాత కూడా చాలా న్యూసెన్స్ చేశారు. వీటికి బాధ్యుడిని చేస్తూ పల్లవి ప్రశాంత్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు 9 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అయితే బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్‌కి యూట్యూబ్‌లో 1.17 మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు.

ఇన్‌స్ట్రాగ్రామ్‌లో 1.1 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. మిగిలిన సోషల్ మీడియా ఖాతాలతో కూడా పల్లవి ప్రశాంత్‌కి మిలియన్లలోనే ఫాలోవర్స్ ఉన్నారు. నిజానికి ఇన్ని కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నప్పుడు ఆదాయం లక్షల్లోనే ఉంటుంది. ప్రస్తుతం సెలబ్రిటీలంతా.. యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా లక్షల రూపాయిలు సంపాదిస్తున్నారు. సోషల్ మీడియా అనేది ఆదాయ వనరుగా మారిన విషయం తెలిసిందే.

అయితే పల్లవి ప్రశాంత్‌కి ఇన్ని కోట్లలో ఫాలోవర్స్, సబ్‌స్క్రైబర్స్ ఉన్నా.. ఇప్పటి వరకూ అతనికి అటు యూట్యూబ్ ద్వారా కానీ.. ఇటు ఇన్ స్ట్రాగ్రామ్ ద్వారా కానీ ఒక్క రూపాయి కూడా రాలేదంటే నమ్మగలమా? కానీ ఇది నమ్మితీరాల్సిందే అంటున్నాడు పల్లవి ప్రశాంత్ గురూజీ.. సోఫాజీ శివాజీ. యూట్యూబ్.. ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా ఆదారం రావాలంటే.. ముందుగా ఆయా ఛానల్స్ మోనిటైజేషన్ కావాలి. అయితే పల్లవి ప్రశాంత్‌కి మోనిటైజేషన్ గురించి కానీ.. అది చేస్తే డబ్బులు వస్తాయనే విషయం కూడా తెలియదని నమ్మశక్యం కానీ నిజాన్ని బయటపెట్టారు హీరో శివాజీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *