ప్రతి సీజన్‌లో 15వ వారంలో వచ్చిన ఓటింగ్‌ని బట్టి విజేతను ప్రకటించేవారు. అయితే ఈ సీజన్‌లో 14వ వారం, 15వ వారం వచ్చే ఓటింగ్‌ని బట్టి విజేతను ప్రకటించబోతున్నట్టు చెప్పారు. అంటే ప్రస్తుతం హౌస్‌లో శివాజీ, యావర్, ప్రశాంత్, శోభా, అమర్ దీప్, ప్రియాంక, అర్జున్‌లు ఉండగా.. గత శుక్రవారం అర్ధరాత్రి నుంచే ఓటింగ్స్ లైన్స్ ఓపెన్ అయ్యాయి.
అయితే రోజు రోజుకు తన ఆటను మెరుగుపరుచుకుంటూ ప్రశాంత్ సెలబ్రిటీలకు సైతం షాకిస్తున్నాడు.హౌస్‌లో అడుగుపెట్టినప్పుడు ప్రశాంత్‌కు , ప్రస్తుతం ప్రశాంత్‌కు చాలా తేడా కనిపిస్తుంది. మొదట్లో అమ్మాయిలతో మాట్లాడానికి ఎక్కువుగా ఇష్టపడేవాడు. ముఖ్యంగా రతికతో పల్లవి ప్రశాంత్ వ్యవహారించిన తీరు చూసిన తరువాత.. మనోడు ఎక్కువ కాలం హౌస్‌లో ఉండడని అందరూ భావించారు.
కాని నాగార్జున ఇచ్చిన వార్నింగ్‌తో తన ఆటతీరును మార్చుకుని 7వ సీజన్‌లో మొదటి కెప్టెన్‌గా ఎంపికై సంచలనం సృష్టించాడు. ఒకనొక సమయంలో పల్లవి ప్రశాంత్ షో మధ్య నుంచే బయటకు వస్తున్నారని ప్రచారం జరిగింది.గేమ్ ఆడే సమయంలో పల్లవి ప్రశాంత్ తలకు గాయం అయింది. తలకు తీవ్రమైన గాయం కావడంతో పల్లవి ప్రశాంత్‌ను బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేస్తున్నారనే ప్రచారం జరిగింది.