తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీ అయిపోయాడు రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్. ప్రస్తుతం అతడు తెలియని బుల్లితెర ప్రేక్షకుడు లేడు. పల్లవి ప్రశాంత్ సోషల్ మీడియా సెలబ్రిటీ కావాలనుకున్నాడు. వ్యవసాయం చేస్తున్న వీడియోలు పోస్ట్ చేశాడు. అలా రైతుబిడ్డగా పాప్యులర్ అయ్యాడు. aite ఒకటి రాష్ట్ర ప్రభుత్వ ప్రాపర్టీ ధ్వంసం, రెండోది కేంద్ర ప్రభుత్వ ప్రాపర్టీ ధ్వంసం. కాగా స్టేట్ గవర్నమెంట్ ప్రాపర్టీ డ్యామేజ్ కేసులో పల్లవి ప్రశాంత్ కు 3 ఏళ్లు శిక్ష పడే అవకాశం.
అదే సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్టీ ధ్వంసం కేసుల్లో రైల్వే సెక్షన్ల ప్రకారం 7 సంవత్సరాలు జైలు శిక్షపడే అవకాశం ఉంది. ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ కు 41 సీఆర్పీసీ సెక్షన్ ప్రకారం నోటీసులు పంపిస్తామని ఒక వర్గం చెబుతుంది. ఒక సెలబ్రిటీ అందరికీ ఆదర్శంగా ఉండాల్సింది పోయి తనే ఇలా ప్రవర్తించడం, ముందే ఫ్యాన్స్ ను తీసుకు రావద్దని చెప్పిన తర్వాత కూడా వినకుండా మొండిగా వ్యవహరించడంతో పోలీసులు ఆయనను రిమాండ్ కు తీసుకునే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక కృష్ణానగర్ లో ఆర్టీసీ బస్సులపై జరిగిన దాడిపై టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్ గా ఉన్నారు. దాడులకు పాల్పడిన వారిని ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే దాడులకు పాల్పడిన వారిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని వెల్లడించారు. మరి పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.