పల్లవి ప్రశాంత్‌ ప్రేమ కథ వింటే కన్నిల్లే, చివరికి చనిపోదామనుకున్నాడు. కానీ..?

ఈసారి 14 మంది కంటెస్టెంట్స్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. అందులో ప్రస్తుతం ప్రేక్షకులు అందరి దృష్టి ఇద్దరిపై కేంద్రీకృతమై ఉంది. అందులో ఒకరు రతికా రోజ్ …మరొకరు రైతు బిడ్డ గా హౌస్ లోకి ఎంటర్ అయిన పల్లవి ప్రశాంత్. ఇద్దరూ వచ్చిన రోజు నుంచే బాగా ఫ్రెండ్స్ గా మారారు. అయితే అనాదిగా వ్యవసాయం చేస్తోన్న వారు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో.. భయపడుతున్నారు. ఏరైతు తన బిడ్డలు తన లాగే రైతు కావాలని కోరుకోవడం లేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రశాంత్‌.. మాత్రం వ్యవసాయం మీద అమితమైన ప్రేమ పంచుకున్నాడు.

ఎందుకంటే.. ఉద్యోగం చేస్తే.. ఒకరి కింద పని చేయాలి.. అదే వ్యవసాయం అయితే.. తానే పది మంది కడుపు నింపడమే కాక.. ఉపాధి కూడా కల్పించవచ్చు అని భావించాడు. వ్యవసాయం చేయడాన్ని గర్వంగా భావించాడే తప్ప.. అవమానం అనుకోలేదు. ఇక తాను చేసే ప్రతి పనిని వీడియో తీసి యూట్యూబ్‌లో పోస్ట్‌ చేసేవాడు ప్రశాంత్‌. అలా జనాలకు దగ్గరయ్యాడు. బిగ్‌బాస్‌ షోలో పాల్గొనాలనేది తన కల అని చెప్పేవాడు. దీని కన్నా ముందు ప్రశాంత్‌ ఫోక్‌ సాంగ్స్‌ చేసేవాడు. అయితే వాటి ద్వారా వచ్చిన డబ్బును తీసుకుని.. నమ్మిన స్నేహితులే తనని మోసం చేశారని చెప్పుకొచ్చాడు ప్రశాంత్‌.

అది తట్టుకోలేక.. చనిపోదామనుకున్నాను. నేను చనిపోతానంటే.. మా నాన్న కూడా చనిపోతాను అన్నాడు. ఎవరో మోసం చేస్తే.. నేను ఎందుకు నా జీవితాన్ని నాశనం చేసుకోవాలని అనుకున్నాను. ఆతర్వాత నేను సోషల్‌ మీడియాలో వీడియోలు పెట్టడం ప్రారంభించాను. ఇక బిగ్‌బాస్‌లోకి వెళ్లాలనేది నా కోరిక. అందుకే ప్రతి వీడియోలో నాకు బిగ్‌ బిగ్‌బాస్‌ అవకాశం ఇవ్వమని కోరేవాడిని.. చివరకు నా కల ఫలించింది అని చెప్పుకొచ్చాడు ప్రశాంత్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *