జైలునుంచి విడుదలైన పల్లవి ప్రశాంత్‌, ఎవడు ఇదంతా చేసాడో చెప్పిన ప్రశాంత్‌.

ఫినాలే తర్వాత పల్లవి ప్రశాంత్ విన్నర్ అని ముందే న్యూస్ లీకైంది. దీంతో ప్రశాంత్ కోసం భారీగా అభిమానులు అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు వచ్చారు.ఇక అమర్ ఫ్యాన్స్ .. ప్రశాంత్ ఫ్యాన్స్ కొట్లాటకు దిగారు. అయితే గత ఆదివారం బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 7 గ్రాండ్‌ ఫినాలే జరిగింది. విజేత ఎవరో డిసైడ్‌ అయ్యే తరుణం కాబట్టి.. షో జరుగుతున్న అన్నపూర్ణ స్టూడియోస్‌ దగ్గరకు పెద్ద ఎత్తున కంటెస్టెం‍ట్ల ఫ్యాన్స్‌ వచ్చారు. వీరిలో పల్లవి ప్రశాంత్‌ ఫ్యాన్స్‌ ఎక్కువ మంది ఉన్నారు. షోలో విజేతగా నిలిచింది ప్రశాంత్‌ అని తెలిసిన తర్వాత వారు సంతోషం వ్యక్తం చేశారు.

వారు అంతటితో ఆగలేదు. రన్నర్‌ అప్‌గా నిలిచిన అమర్‌ దీప్‌ స్టూడియో నుంచి బయటకు వస్తుండగా.. ఆయన కారును ముట్టడించారు. కారుపై రాళ్లతో దాడి చేశారు. లోపల ఉన్నవారిపై కూడా దాడి చేయటానికి ప్రయత్నించారు. దాదాపు అరగంట పాటు అమర్‌ దీప్‌ కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేశారు. పోలీసుల రంగంలోకి దిగి కారును భద్రత నడుమ పక్కకు పంపించారు. తర్వాత కూడా ప్రశాంత్‌ ఫ్యాన్స్‌ తమ రచ్చ కొనసాగించారు. మరికొంత మంది సెలెబ్రెటీల కార్లను ధ్వంసం చేశారు.

ఏకంగా కొన్ని ఆర్టీసీ బస్సులను పాడు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రశాంత్‌కు పలు ఆదేశాలు ఇచ్చారు. గొడవ జరుగుతున్న ప్రాంతం నుంచి కాకుండా.. వేరే వైపు నుంచి బయటకు వెళ్లాలని చెప్పారు. అయితే, ప్రశాంత్‌ ఫ్యాన్స్‌ ఉన్న వైపునుంచే బయటకు వెళ్లారు. తమ ఆదేశాలు భేఖాతారు చేయటంతో ఆయనపై కేసు నమోదైంది. ప్రశాంత్‌ అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. కోర్టు బెయిల్‌ ఇచ్చింది. మరి, ప్రశాంత్‌ బెయిల్‌పై బయటకు రావటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *