ఆ స్టార్ సింగర్ ని ప్రేమించిన యాంకర్ ఓంకార్. పెళ్లి ఎప్పుడో తెలుసా..?

ఓంకారం కి బుల్లితెరపై ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా బుల్లితెర పై అన్ని షో లకు అతని డైరెక్షన్ చేస్తూ ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరిస్తూ ఉంటారు. ముఖ్యంగా జెమినీ ఛానల్ లో మ్యూజిక్ షో కు యాంకర్ గా మొదట తన కెరీర్ను ప్రారంభించి.. అలా అంచలంచెలుగా ఎదిగి ఇప్పుడు తన పేరుని ఒక బ్రాండ్ గా మార్చుకున్నారు. అయితే ప్రస్తుతం ఓంకార్ ఎటువంటి పొజిషన్లో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ప్రొడ్యూసర్ గా రాణిస్తూ పలు సినిమాలు తీస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఓంకార్ గురించి ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. ఓంకార్ సోషల్ మీడియాలో చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాడు. తన కుటుంబ విషయాల గురించి చాలా తక్కువగా షేర్ చేస్తూ ఉంటాడు. అయితే ఇప్పటికి చాలామందికి పెద్ద సందేహం ఉంది అసలు ఆయనకు పెళ్లి అయిందా లేదా అని. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం ఏంటంటే ఓంకార్ ప్రముఖ సింగర్ ను ప్రేమించాడని,

ఆమెనే పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నాడని, కానీ ఆ తర్వాత ఏమైందో కానీ ఆ సింగర్ వేరే అబ్బాయితో ప్రేమలో ఉండడంతో ఆయన ప్రపోజల్ ను అంగీకరించలేదని ప్రచారం జరుగుతుంది. అయితే ఆమె గతంలో కూడా ఓంకార్ హోస్ట్ చేసినటువంటి షోకి కూడా వచ్చిందని, అప్పుడే తన మనసులోని మాట ఓపెన్ గానే షోలో వెల్లడించాడు ప్రపోజ్ కూడా చేశాడు. అప్పట్లో ఎన్నోసార్లు ఈ న్యూస్ చాలా ట్రెండ్ అయింది. అయితే ప్రపోజ్ చేసిన కొద్ది రోజులకే ఆ సింగర్ వేరే అతడిని పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిలైపోయిందట. దాంతో ఓంకార్ తన ఫస్ట్ లవ్ ఫెయిల్ అయిందంటూ న్యూస్ వైరల్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *