పాత 2 రూపాయల నాణెం మీ దగ్గర ఉంటే చాలు, 5 లక్షలు మీ సొంతం.

పురాతనమైన వస్తువుల విషయంలో వాటి విలువ ఒక్కోసారి అనూహ్యంగా కూడా ఉంటుంది. ప్రస్తుతం పాత నాణేలు.. కరెన్సీకి గిరాకీ బాగా పెరిగింది. చాలా వెబ్సైట్స్ ఆన్లైన్ లో పాత నాణేల కోసం ప్రకటనలు ఇస్తున్నాయి. వాటికి విపరీతమైన ధరనూ ఆఫర్ చేస్తున్నాయి. అయితే మీ దగ్గర పాత రెండు రూపాయల బిళ్ల ఉన్నదా? అయితే రూ.5 లక్షలు మీ సొంతం. ఒక్క నిమిషం ఆగండి! ఆ 5 లక్షలు మీ సొంతం కావాలంటే మీ దగ్గర ఉన్న రూ.2 బిళ్లపై జాతీయ జెండా ఉండి, 1994లో విడుదల చేసినదై ఉండాలి.

ఇదొక్కటే కాదు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఆర్బీఐ విడుదల చేసే పాత నాణేలకు ఇప్పుడు భారీగా డిమాండ్‌ ఉన్నది. పాత నాణేల విక్రయానికి పలు ఆన్‌లైన్‌ సైట్లు కూడా వెలిశాయి. అటు.. ఔత్సాహికులు కూడా పాత నాణేలు కొనటానికి వెనుకాడటం లేదు. చాలామంది పాత నాణేలు ఇచ్చి, లక్షలు పోగేసుకొంటున్నారు. క్వికర్‌ వెబ్‌సైట్‌లో పాత నాణేల కొనుగోలు, విక్రయాలు జరుగుతున్నట్టు తెలుస్తున్నది. పాత నాణేలను విక్రయించేందుకు ముందుగా మన వివరాలతో వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. విక్రయించదలచుకున్న నాణేల ఫొటోలు, వివరాలను జతచేయాలి.

ప్రస్తుతం భారతదేశ పటం బొమ్మగా ఉన్న రూ.2 పాత నాణెం, పాత రూపాయి, ఐదు రుపాయల నాణేలు, పాత పది, ఐదు రూపాయల కరెన్సీ నోట్లకు ఎక్కువగా డిమాండ్‌ ఉన్నట్టు తెలుస్తున్నది. అయితే, ఈ నాణేల విక్రయానికి తమకు ఏ సంబంధం లేదని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రకటించింది. ఆర్బీఐ పేరును, లోగోను వాడి కమీషన్లు, ట్యాక్స్‌ల పేరిట డబ్బులు వసూలు చేయటం నిబంధనలకు విరుద్ధం అని సర్క్యులర్‌ జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *