యూట్యూబర్ గా పల్లవి ప్రశాంత్ పాపులర్. ఆయన సోషల్ మీడియా వేదికగా తాను రైతు బిడ్డనని, బిగ్ బాస్ కు వెళ్లడం తన కల అంటూ చెప్తూ ఉన్నాడు. ఇన్ స్టా గ్రామ్ లో బిగ్ బాస్ కు వెళ్లేందుకు సపోర్ట్ చేయాలనీ చాలా కాలం నుంచి ఆడియన్స్ ను రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. మొత్తానికి మనోడు అనుకున్నది సాధించాడు. బిగ్ బాస్ సీజన్ సెవన్ లోకి సక్సెస్ ఫుల్ గా అడుగు పెట్టాడు. అయితే ఇక వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన భోలే షావలి బయట విషయాలు తీసుకొచ్చి ఇంట్లో లీక్ చేశాడు.
ప్రశాంత్ తో ఒక విషయం చెప్పాడు. పల్లవి ప్రశాంత్ ఫేమ్ చూసి ఆయనకు ఒక సినిమా ఆఫర్ వచ్చిందని చెప్పాడు. నీకు బయట ఒక బంపర్ ఆఫర్ ఉంది,అది సినిమా ఛాన్స్ రైతుల కాన్సెప్ట్ తో తీయబోతున్నారు.నిన్ను హీరోగా సెలెక్ట్ చేసుకున్నారు అని బయట విషయాలు లీక్ చేసాడు. ఇలా చేయడం బిగ్ బాస్ రూల్స్ కి వ్యతిరేకం. భోలే చెప్పిన ఈ విషయం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. భోలే హౌస్ లో అడుగుపెట్టిన రోజు నుంచే వింతగా ప్రవర్తిస్తూ,అర్ధంలేని మాటలతో, చేష్టలతో విపరీతమైన ట్రోలింగ్ కి గురౌతున్నాడు.
ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే ప్రశాంత్ సినిమా ఛాన్స్ కొట్టేసాడు అని తెలుస్తుంది. చూడాలి మరి ఇది ఎంతవరకు నిజమో అని. ఇక పల్లవి ప్రశాంత్ ఐతే తన ఆట తీరును చాలా మార్చుకున్నాడు.ఈ వారం జరిగిన టాస్కుల్లో చాలా బాగా ఆడాడు. అందరితో మంచిగా ఉంటూ, ప్రేక్షకుల అభిమానం పొందుతూ దూసుకుపోతున్నాడు. కెప్టెన్సీ ద్వారా వచ్చిన ఇమ్మ్యూనిటీ తో ఈ వారం తో పాటు వచ్చే వారం కూడా నామినేషన్స్ నుంచి సేఫ్ అయిపోయాడు ప్రశాంత్. ఆరో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఉత్కంఠగా మారింది.