తెగ సిగ్గు పడుతూ..రోజా కూతురు దేని గురించి మాట్లాడుతుందో చుడండి.

ఒకప్పుడు తన అందచందాలతో అలరించిన రోజా.. హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ అయిపోయారు. అయితే తెలుగులోనే కాదు… ఇతర భాషల్లోనూ నటించి.. రోజా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఇక హీరోయిన్‌గా కొన్నాళ్లు చేసిన రోజా.. ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్టుగాను సినిమాల్లో నటించారు. అయితే అది అలా ఉంటే.. రోజా కూతురు తాజాగా తన బర్త్ డే సందర్భంగా ఓ వీడియోను తన సోషల్ మీడియాలో పంచుకుంది.

తన 20వ బర్త్ డే సందర్భంగా ఆమె ఓ వీడియోలో మాట్లాడుతూ.. చిన్నప్పుడూ బర్త్ డే అంటే పెద్దగా పట్టించుకనేది కాదు.. అయితే ఇప్పుడు 20 బర్త్ మరో కొన్ని గంటల్లో వస్తుండడంతో చాలా నర్వస్‌గా, ఎంగ్జైటీగా ఉందని తెలిపింది. అది అంతా అలా ఉంటే.. ఆమె మాట్లాడిన ఇంగ్లీష్ యాక్సెంట్‌పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. తెలుగులో మాట్లాడోచ్చుగా.. తెలుగు రాదా.. అని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతూ.. నటి మంచు లక్ష్మి గుర్తు వచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక అది అలా ఉంటే మినిష్టర్ రోజా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు.

తనకు, తన ఫ్యామిలీకి సంబంధించిన అప్‌డేట్స్‌ను అక్కడ పోస్ట్ చేస్తూ, తన ఫాలోవర్స్‌కు మరింత దగ్గరవుతుంటారు. ఆమె ఎప్పటి కప్పుడు తన ఫ్యామిలీతో పాటు ఫ్రెండ్స్‌కు సంబంధించిన ఫోటోలను, అప్ డేట్స్‌ను తన సోషల్ మీడియాలో పంచుకుంటూ మరింత దగ్గరవుతున్నారు. ఇక్కడ మరో విషయం ఏమంటే.. రోజా కూతురు అన్షు మాళిక త్వరలో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారట. దీనికి సంబంధించి ఓ వార్త ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *