రాశి..పెళ్లిపందిరి గోగులంలో సీత, శుభాకాంక్షలు, మనసిచ్చి చూడు వంటి చాలా సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది . ఒకపక్క ఇల్లాలి పాత్రలు చేస్తూనే మరో పక్క గ్లామర్ రోల్స్ కూడా చేస్తూ మెప్పించింది ఈమె. తమిళంలో విజయ్ వంటి స్టార్ హీరోల సరసన కూడా నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. అయితే కొత్త హీరోయిన్ల ఎంట్రీ తో ఆమెకి అవకాశాలు తగ్గాయి.
అయితే రాశి నటించిన సీరియళ్లకు రికార్డ్ స్థాయిలో రేటింగ్స్ వస్తుండటంతో పాటు ఆమె రెమ్యునరేషన్ కూడా భారీ స్థాయిలోనే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సినిమాల ద్వారా సీనియర్ నటి రాశిబాగానే ఆస్తులు కూడబెట్టారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.. కాగా, ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..రాశి మాట్లాడుతూ తన ఆస్తులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.రాశి మాట్లాడుతూ వెనక్కు తిరిగి చూస్తే నా చిన్నతనం గుర్తుకు వస్తాయని అన్నారు.
ఆ సమయంలో బిజీబిజీగా షూటింగ్స్ లో పాల్గొన్నానని రాశి వెల్లడించారు.నేను డబ్బులు ఏమీ పోగొట్టుకోలేదని ఆమె అన్నారు.ఇకపోతే సినిమాలలో ఛాన్స్ ల కోసమే బరువు తగ్గానని ప్రేక్షకులు నన్ను ఏ విధంగా చూడాలని కోరుకుంటున్నారో అదే విధంగా కనిపించాలని భావిస్తున్నానని రాశి తెలిపారు.రాశి నిక్ నేమ్ మంత్ర కావడం గమనార్హం.ఏపీలోని బెజవాడలో జన్మించిన రాశి చెన్నైలో చదువుకున్నారు. ఆదిత్య369 సినిమాలో రాశి నటించారనే విషయం చాలామందికి తెలియదు.