ప్రభాస్ నాన్నని ఎప్పుడైనా చూసారా..! అచ్చం ప్రభాస్ లా ఎలా ఉన్నారో చుడండి.

బాహుబలి బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొట్టడంతో ప్రభాస్ రేంజ్ పాన్ ఇండియా స్థాయికి పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నాయి. ఇదిలా ఉండగా ప్రభాస్ వ్యక్తిగత విషయానికి వస్తే ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణం రాజు వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టారు.

ఇలా ప్రభాస్ కృష్ణంరాజు ప్రోత్సాహంతోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారని ప్రతి ఒక్కరు భావిస్తారు. కానీ నిజానికి ప్రభాస్ తండ్రికి కూడా సినిమా ఇండస్ట్రీతో ఎన్నో అనుబంధాలు ఉన్నాయన్న విషయం చాలా మందికి తెలియదు. ప్రభాస్ తండ్రి పేరు సూర్య నారాయణ రాజు. తాజాగా ప్రభాస్ కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ గా మారింది. ప్రభాస్ ఫాదర్ అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది కృష్ణంరాజు.

ఈయన ప్రభాస్ కి కన్నతండ్రి కాకపోయినా వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం బట్టి ప్రతి ఒక్కరు వీరిద్దరూ తండ్రి ,కొడుకు అనుకుంటారు. ఇక తాజాగా ప్రభాస్ రియల్ తండ్రి ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *