రాజశ్రీ ఫిల్మ్ వారు తమ కొత్త సినిమా కోసం కొత్త కళాకారులకోసం వెతుకుతూ వార్తాపత్రికల్లో ప్రకటన ఇచ్చారు. అది చూసి రామేశ్వరి దరఖాస్తు పెట్టుకున్నది. అలా దుల్హన్ వహీ జో పియా మన్ భాయే సినిమాలో హీరోయిన్‌గా ఎంపికయ్యింది. అయితే తాళ్ళూరి రామేశ్వరి తెలుగు, హిందీ సినిమా నటి. దూరదర్శిని కార్యక్రమాలలోనూ కూడా నటించింది. తిరుపతికి చెందిన ఈమె నటనలో శిక్షణ తీసుకుని హిందీ సినిమాల్లో నటించారు.
ఆ తర్వాత కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సీతామాలక్ష్మి సినిమాలో నటించి తెలుగులో పేరు తెచ్చుకున్నారు. సూపర్ హిట్ సాధించిన ఈ చిత్రంలో ఆమె నటనకు ప్రభుత్వం పురస్కారం ఇచ్చి సత్కరించింది. తర్వాత మంగళతోరణాలు అనే చిత్రంలో నటించారు. తరువాత ఈమె హిందీ సినిమా రంగంలో స్థిరపడ్డారు. సునయనా అనే చిత్రంలో నటించే సమయంలో ప్రమాదం జరిగి కంటికి గాయమైంది. ఇటీవలి కాలంలో నిజం అనే తెలుగు చిత్రంలో మహేష్ బాబు తల్లిగా క్లిష్టమైన పాత్రలో నటించారు.
రామేశ్వరి తల్లితండ్రుల స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లాలోని లంకలకోడేరు గ్రామం. కానీ రామేశ్వరి నెల్లూరులో జన్మించింది. 9వ తరగతి వరకు రామేశ్వరి చదువు కాకినాడలో సాగింది. ఆ తరువాత ఆమె తండ్రి వృత్తి రీత్యా కుటుంబము తిరుపతిలో స్థిరపడింది. తిరుపతిలో ఉండగా సినిమా షూటింగు చూసిన రామేశ్వరి సమ్మోహితురాలై సినీరంగంలో చేరాలని నిశ్చయించుకున్నది. మధ్యతరగతి కుటుంబాలు తమ పిల్లలని సినీరంగంలో చేరటం ప్రోత్సహించిన ఆ రోజుల్లో రామేశ్వరి తండ్రి విశాల ధృక్పధంలో పిల్లలను వారికి నచ్చిన రంగంలో స్థిరపడే స్వతంత్రం ఇచ్చాడు.