గడిచిన పది రోజుల్లో పసిడి రేటు వెలవెలబోయింది. పుత్తడి నేల చూపులు చూసింది. బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి కూడా భారీగా కుప్పకూలింది. అందుకే గోల్డ్, సిల్వర్ ప్రియులకు ఇది ఊరట కలిగించే అంశం. మరికొద్ది రోజుల్లో దసరా వస్తోంది. ఆ తర్వాత దీపావళి కూడా వస్తోంది. అందువల్ల మీరు బంగారం కొనే ప్లానింగ్‌లో ఉంటే.. ఈ అవకాశాన్ని సొంతం చేసుకోవచ్చు. బంగారం ధరలు, వెండి రేట్లు భారీ పతనం అయ్యాయి. అందుకే కొనే వారు ఈ అవకాశం సొంతం చేసుకోవచ్చు. లేదంటే తర్వాత రేట్లు పైకి చేరొచ్చు.
అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా గత పది రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. రూ. 200, 250, 600, 250, 300, 150, 600, 10, 190గా తగ్గింది. సెప్టెంబర్ 26న రూ. 54,750గా ఉన్న పసిడి ధరలు అక్టోబర్ 6న రూ. 52,400గా ఉంది. అంటే ఈ 8-10 రోజుల్లో రూ. 2000లకు పైగా తగ్గింది. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,400 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,160గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 190.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 210 తగ్గింది.
ఈ పసిడి ధరలు దేశీయ మార్కెట్లో ఈరోజు ఉదయం నమోదైనవి. గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,550లుగా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,310గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,950లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 57,760గా నమోదైంది. ముంబై, బెంగళూరు, కేరళ, హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 52,400 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 57,160గా కొనసాగుతోంది.