ఇంట్లో జాలీగా ఎంజాయ్ చేస్తున్న పూజా హెగ్డే. ప్రజెంట్ సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’లో ఆమె నటిస్తున్నారు. షూటింగ్ నుంచి బ్రేక్ రావడంతో పూజ ఫ్రీ టైమ్ లో జాలీగా ఉంటున్నారు. కళ్ళ కింద బ్లాక్ సర్కిల్స్ రాకుండా పూజా హెగ్డే కేర్ తీసుకుంటున్నారు. టాలీవుడ్ బుట్టబొమ్మగా పేరు తెచ్చుకుంది బ్యూటిఫుల్ పూజా హెగ్డే.
మాస్క్ అనే తమిళ సినిమాతో సినీ రంగుల ప్రపంచంలోకి అడుగు పెట్టిన ఈ సుందరాంగీ మొదట మోడలింగ్ బాటలో పయనించింది. మోడలింగ్ రంగంలో తనదైన అందచందాలతో ఆకట్టుకుని పలు అవార్డ్స్ సొంతం చేసుకుంది.ఈ క్రమంలోనే దర్శకనిర్మాతల దృష్టిని ఆకర్షించింది ముద్దుగుమ్మ పూజా హెగ్డే. అలా సినీ అవకాశాలను అందిపుచ్చుకుంది పూజా హెగ్డే.
అయితే ఇటీవల పూజా హెగ్డే నటించిన సినిమాలు వరుసగా ప్లాప్ కావడంతో ఆమె సినీ కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. ఆచార్య, బీస్ట్, కిసీ కి భాయ్ కిసి కీ జాన్, సర్కస్ మూవీస్ వరుసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఈ ఎఫెక్ట్‍తోనే మహేశ్ బాబు గుంటూరు కారం సినిమాలో మెయిన్ హీరోయిన్ అవకాశం పోగొట్టుకుందని టాక్ వినిపిస్తోంది.