సినిమా రంగంలో డేటింగ్, షూటింగ్ లు చాలా కామన్. నచ్చితే కలిసి ఉంటారు, నచ్చకపోతే విడిపోతారు, మొత్తానికి రంగుల ప్రపంచంలో ఉన్న వారి జీవితాల్లో ఎన్నో రంగులు లొసుగులు ఉంటాయి. ఇక ప్రేమ, పెళ్లి, విడాకులు కూడా సర్వసాధారణం. అయితే.. కొంతమంది భామలు మాత్రం ప్రేమించినా పెళ్ళికి మాత్రం దూరంగా ఉన్నారు. అయితే తమ అందచందాలతో ప్రేక్షకులను అందాల కలల ప్రపంచంలో విహరింప చేసిన ఈ తారలు వయసు పై పడినా ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయారు. టబు.. నాగార్జున సరసన ఎన్నో చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె చాలా పలు ఇండస్ట్రీలో సినిమాలలో నటించింది. ఇకపోతే ఈమె కూడా పెళ్లి చేసుకోలేదు.
తాజాగా వచ్చిన అల్లు అర్జున్ సినిమా అల వైకుంఠపురం లో సినిమా ద్వారా సినిమాలలోకి రీ ఎంట్రీ ఇచ్చింది..ఇంకా పెళ్లి చేసుకో దని అర్థమవుతుంది. శోభన.. ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం అంటూ సాంగ్ లో కోపిష్టిగా కనిపించిన శోభన ఎన్నో సినిమాలలో నటించింది. అయితే ఈమె సినిమాలకు అయితే న్యాయం చేసింది. కానీ తన జీవితంలో ఎటువంటి సుఖ భోగాలు అనుభవించకుండా అలానే గడి పేస్తుంది. విజయ శాంతి.. విజయ శాంతి. లేడీ అమితాబ్ గా అందరి మనసులో నిలిచింది. అందుకే ఆమెను లేడీ బాస్ అని అంటారు. సినిమాలలో ఎలా ఉంటుంది .
రాజకీయాల్లో కూడా అలానే ఉంటుంది. చాలా కాలం నుండి సినిమాలకు దూరంగా ఉన్నా ఈమె ఇటీవలే వచ్చిన మహేష్ బాబు సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది. ఈమె కూడా పెళ్లి చేసుకోలేదని అందరికీ తెలిసిందే. సుష్మితా సేన్..బోల్డ్ సమాజంలో ఎదురులేని మరో ముదురు హీరోయిన్ సుష్మితా సేన్. వయసు అయిపోతున్నా ఇంకా ఒంటరి జీవితాన్నే గడుపుతుంది. అయితే, ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుంది. కానీ గత ఏడాది వరకు రొమన్ షాల్ అనే వ్యక్తితో సహజీవనం చేసింది. ఇప్పుడు అతన్ని వదిలేసింది అనుకోండి. ప్రస్తుతానికి అయితే ఒంటరి బతుకులోని బతుకు ఉంది అంటుంది.
నగ్మా..టాలీవుడ్ లోనే కాదు హిందీ, మరాఠీ, తమిళ, కన్నడ లాంటి భాషల్లోనూ తనదైన గ్లామర్ తో మెరుపులు మెరిపించిన హీరోయిన్. వయసు దాటిపోతున్నా ఇంకా ఒంటరిగానే ఉంటుంది. పెళ్లి పేరు చెబితే.. పారిపోతుంది. రెండు సార్లు ప్రేమలో విఫలమవడంతో ఒంటరిగా ఉండటానికి నగ్మా అలవాటు పడిపోయినట్టు ఉంది. సితార.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు సినీ లోకంలో ఒక వెలుగు వెలిగిన నటి సితార. తనకంటూ ప్రత్యేక గుర్తింపు వచ్చినా.. పైగా వయసు అయిపోతున్నా ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. నిజానికి పెళ్లి చేసుకోవాలనుకున్నా సితారకు కాలం కలిసి రాలేదు.
తనను సరిగ్గా గైడ్ చేసేవారు లేకే ఇలా ఒంటరిగా మిగిలిపోయాను అని సితార ఫీల్ అవుతూ ఉంటుంది. నర్గీస్ ఫక్రీ.. హిందీ పరిశ్రమలో పరిచయం అవసరం లేని పేరు నర్గీస్ ఫక్రీది. ఆమె అందాల కనువిందుల గురించి ఎంత మొర పెట్టుకున్నా అది ఎప్పటికీ తనవి తీరనది కాబట్టి.. ఆ బాగోతాన్ని వదిలేద్దాం. వయసు అయిపోతున్నా నర్గీస్ ఫక్రీ ఇంకా పెళ్లి చేసుకోలేదు. కారణం.. ప్రతి ఏడాది కొత్త ప్రేమలకు అలవాటు పడటం, అలాగే కుటుంబ బంధాల పై సరైన అభిప్రాయం లేకపోవడమే, అలాగే ఆమె విచ్చలవిడి ఒంటరితనానికి అడ్డుఅదుపు లేకపోవడం కూడా. ఏది ఏమైనా ఈ ముదురు భామలు ఇలా ఒంటరిగా మిగిలిపోవడం బాధాకరమైన విషయమే.