బిగ్‌ బాస్‌లోకి వెళ్తే విడాకులే..! నటుడికి భార్య స్ట్రాంగ్ వార్నింగ్‌.

నచ్చావ్‌,మన్మధుడు,మల్లీశ్వరి, జై చిరంజీవ వంటి సూపర్‌ హిట్‌ సినిమాలు తీశారు. తాజాగ ఆయన కుమారుడితో జిలేబి అనే సినిమా తీశారు. ఇందులో రాజశేఖర్‌ కుతురు శివాని హీరోయిన్‌గా నటించింది. ఇప్పుడు ఆయన అల్లుడు రవి శివతేజ కూడా పలు షార్ట్‌ ఫిలిమ్స్‌లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. అయితే వెండితెర ఆఫర్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్న రవి శివతేజ ఇటీవల ఉస్తాద్ మూవీలో నటించాడు. శ్రీసింహ, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా విడుదలైన ఉస్తాద్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. శ్రీసింహ ఫ్రెండ్ గా రవి శివతేజ ఫుల్ లెంగ్త్ రోల్ చేశాడు.

తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రవి శివతేజ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఉస్తాద్ మూవీలో విషయం ఉన్నప్పటికీ జైలర్, భోళా శంకర్ వంటి బడా చిత్రాల మధ్య ఆదరణకు నోచుకోలేదని అన్నారు. ఇక వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ… శ్యామలను ప్రేమించే నాటికి ఆమె దర్శకుడు విజయ్ భాస్కర్ కూతురని నాకు తెలియదు. తెలిశాక పెళ్లి జరుగుతుందా అని భయం వేసింది. శ్యామల తన కుటుంబ సభ్యులను ఒప్పించి నన్ను వివాహం చేసుకుంది. నేను కష్ట సమయాల్లో ఉన్నప్పుడు ఆమె మద్దతుగా నిలిచిందని అన్నారు.

రవి శివతేజ బిగ్ బాస్ కి వెళుతున్నాడనే ప్రచారం జరుగుతుండగా ఆయన స్పందించారు. నేను బిగ్ బాస్ సీజన్ 7కి ఎంపికయ్యాననే న్యూస్ లో నిజం లేదు. అవన్నీ పుకార్లే. నేను బిగ్ బాస్ షోకి వెళితే మా ఆవిడ విడాకులు ఇస్తాను అందని కామెడీగా చెప్పాడు. రవి శివతేజ బిగ్ బాస్ షో గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కాగా సెప్టెంబర్ 3న బిగ్ బాస్ షో గ్రాండ్ గా లాంచ్ అవుతుంది. వరుసగా ఐదోసారి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *