ఆధునిక కాలంలో గుండె జబ్బుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన తర్వాత వచ్చే గుండె జబ్బులు ఇప్పుడు చిన్న వయసులోనే వస్తున్నాయి. పొగత్రాగడం, మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, వంశానుగతంగా వచ్చే జన్యువులు, వ్యాయామ లోపం, మానసిక ఒత్తిడి గుండెజబ్బులకు కారణమవుతున్నాయి. అయితే ప్రముఖ నిర్మాత, ఏషియన్ థియేటర్స్ అధినేత, డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్ ఆరోగ్యానికి సంబంధించి ఈ రోజు ఉదయం అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిదే.
ఈ నేపథ్యంలో సునీల్ నారంగ్ సోదరుడు.. భరత్ నారంగ్ పుకార్లని ఖండిస్తూ క్లారిటీ ఇచ్చారు. సునీల్‌కి గత రాత్రి హార్ట్ ఎటాక్ వచ్చిన కారణంగా అపోలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. వెంటనే ఆయనకి వైద్యులు స్టంట్స్ వేశారు. ప్రస్తుతం నా సోదరుడు క్షేమంగా ఉన్నారని వెల్లడించారు. అలాగే ఆయన రేపు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారు. సునీల్ ఆరోగ్యం గురించి ఫోన్లు చేసిన వారందరికీ సునీల్.. పేరు పేరునా ధన్యవాదాలు తెలపమన్నారు.

ప్రస్తుతం ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు స్టేట్ మెంట్ విడుదల చేశారు భరత్ నారంగ్. కాగా నైజాంలో భారీ చిత్రాలను పంపిణీ చేయటంతో పాటు ఏషియన్ సినిమాస్ పేరిట థియేటర్స్ బాగోగులు చూసుకుంటూంటారు సునీల్. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తోన్న లవ్ స్టోరీ చిత్రానికి సునీల్ నారంగ్ నిర్మాతగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే.