త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతున్నా నిహారిక, అబ్బాయి ఎవరంటే..?

మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక కొణిదెల.. యాంకర్ గా బుల్లితెరపై అడుగుపెట్టింది. ఆ తర్వాత పలు సినిమాలు, వెబ్ సిరీసుల్లో నటించింది. ఇక పెద్దల సమక్షంలో చైతన్య జోన్నలగడ్డను పెళ్లి చేసుకుంది. క్యూట్ కపుల్స్ లో వీరు ఒకరు పేరు తెచ్చుకున్నారు. ఏం జరిగిందో తెలియదు.. గత ఏడాది సైలెంటుగా విడాకులు తీసుకుని షాకిచ్చారు. ఇక మెగా ఫ్యాన్స్ కూడా చాలా కంగారుపడిపోయారు. వీరు ఎందుకు విడిపోయారు అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. మరోవైపు నిహారిక గతంలో పాడ్ కాస్ట్ లో తన విడాకుల గురించి చెప్పుకువచ్చింది.

విడిపోతామని తెలిసి ఎవరూ పెళ్లి చేసుకోరని వెల్లడించింది. అది కూడా ఎంతో గ్రాండ్‌గా.. లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి అసలే సెలబ్రేషన్స్‌ చేయరని పాడ్ కాస్ట్ లో తెలిపింది. అయితే అప్పుడు సైతం ఆమె మాటలు వైరల్ గా మారాయి. దీనిపై జోన్నలగడ్డ చైతన్య సైతం స్పందించి.. విడాకులు రెండు మనుషుల మధ్య విషయం.. దాన్ని పబ్లిక్ గా మాట్లాడకూడదని లా పాయింట్స్ మాట్లాడాడు.తాజాగా మరోసారి నిహారిక తన రెండో పెళ్లి గురించి చెప్పుకువచ్చింది.

తనకు పిల్లలంటే ఇష్టం… పిల్లలు కావాలంటే కచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందే అంటూ చెప్పుకువచ్చింది. ప్రేమ మీద నెగెటివ్‌ ఇంప్రెషన్‌ అయితే లేదన్న నిహారిక… ఒక రిలేషన్‌షిప్‌ వర్కవుట్‌ కాలేదంటే ఎన్నో కారణాలుంటాయని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. రెండో పెళ్లి అయితే చేసుకుంటాను.. అది ఎప్పుడు అనేది క్లారిటీ లేదు అంటూ చెప్పుకువచ్చింది. ఈమె వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *