నిహారిక..విడాకుల వార్త విన్న తర్వాత మెగా అభిమానులు షాక్ అయ్యారు. కానీ ఆమె మాత్రం తన ఫ్రెండ్స్ తో పార్టీలు చేసుకుంటూ ఫుల్ జోష్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే తాజాగా ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియోని షేర్ చేసింది నిహారిక. అయితే వీరి కాపురం మూడునాళ్ళ ముచ్చటగానే మారింది. ఈ జంట మధ్య విబేధాలు రావడంతో ఇద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు. ఈ విషయాన్నీ అధికారికంగా కూడా ప్రకటించారు. మేము మా పరస్పర అంగీకారంతో డైవర్స్ తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
ఇక విడాకుల తరువాత నిహారిక తన కెరీర్ ను సెట్ చేసుకొనే పనిలో పడింది. నటిగా, నిర్మాతగా బిజీగా మారింది. ఇంకోపక్క కుటుంబంతోనూ, ఫ్రెండ్స్ తోను టైమ్ స్పెండ్ చేస్తూ మళ్లీ సెట్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. ఇక ఇటుపక్క చైతన్య సైతం .. ఇప్పుడిప్పుడే ఈ విడాకుల గొడవల నుంచి తేరుకుంటున్నట్లు తెలుస్తోంది. మొన్నటికి మొన్న ప్రశాంతత కోసం ధ్యాన కేంద్రంలో కొన్ని రోజులు ఉన్న చైతన్య విడాకులు మంజూరు అయ్యాక.. తన కెరీర్ మీద ద్రుష్టి పట్టినట్లు తెలుస్తోంది.
సోషల్ మీడియాలో చాలా తక్కువగా కనిపించే ఇతను తాజాగా కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకున్నాడు. నిహారికతో విడాకులు తీసుకున్నాకా మొదటిసారి ఈ ఫోటోలను షేర్ చేశాడు. ఇక ఈ ఫొటోస్ లో చైతన్య హీరోలా కనిపించాడు. బ్లాక్ అండ్ వైట్ డ్రెస్.. గాగుల్స్ తో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ‘ఆల్ త్రీస్ ఇన్ స్టైల్’ అంటూ క్యాప్షన్ కూడా పెట్టుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. జీవితంలో ఎన్ని జరిగినా.. అక్కడే ఆగకుండా ముందుకు దూసుకువెళ్లాలి.. చీర్ అప్ బ్రో అంటూ నెటిజెన్స్ కామెంట్స్ పెట్టడం విశేషం.