పెళ్లి తర్వాత అసలు నిజం తెలిసింది, త్వరలోనే రెండో పెళ్లి చేసుకుంటా : నిహారిక

నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ చైతన్య మధ్య విభేదాలు రావడంతో.. ఎవరి దారి వారు చూసుకున్నారు. ప్రస్తుతం నిహారిక సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ.. ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోది. అలాగే విడాకుల తరువాత కొంత గ్యాప్ తీసుకొని తన కెరీర్ వైపు అడుగులు వేస్తోంది. అయితే నిఖిల్ విజయేంద్ర సింహ చేసిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక కొణిదెల మాట్లాడుతూ..“మాది ప్రేమ వివాహం కాదు. నాది పెద్దలు కుదిర్చిన సంబంధం. వివాహం, ఆ వెంటనే విడిపోవడం ఎంతో క్లిష్టంగా ఉంటుంది. పెళ్లి అనేది చిన్న విషయం కాదు. జీవితాంతం కలిసి ఉండాలనే ఉద్దేశంతోనే ఎవరైనా వివాహం చేసుకుంటారు.

నేనూ అదే ఆశతో అడుగులు వేశా. అనుకున్నవిధంగా పరిస్థితుల్లేవు. సులభంగా మనుషులను నమ్మకూడదనే విషయం అర్థమైంది. నేనొక జీవిత పాఠం నేర్చుకున్నా. ప్రపంచం ఇక్కడితో అయిపోలేదని తెలుసుకున్నా. ఆవిధంగా ముందుకుసాగుతున్నా. విడాకులు తీసుకున్నప్పుడు ఆన్‌లైన్‌ వేదికగా చాలామంది నా గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. వాటిని చూసి బాధపడిన క్షణాలున్నాయి. చాలా ఏడ్చాను. దాన్ని భరించడం అంత ఈజీ కాదు. నేను ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నానో వాళ్లకు తెలియదు. ఏడాదిలో విడిపోతామని తెలిసి ఎవరూ అంత ఖర్చుపెట్టి పెళ్లి ఘనంగా జరుపుకోరు.

రిలేషన్‌షిప్‌ కొనసాగాలనే అందరూ కోరుకుంటారు.. నేను కూడా అదే కోరుకున్నాను.. కానీ అన్నీ అనుకున్నట్లు జరగవు కదా.. ఇదీ అంతే.. నా గురించి ఏం రాసినా పట్టించుకునేదాన్నే కాదు. క్లిష్ట సమయంలో నాన్న అండగా నిలబడ్డారు. నాకు ధైర్యం చెప్పారు. నా కుటుంబం నన్ను ఎప్పటికీ భారం అనుకోలేదు. ప్రస్తుతానికి నా ఫోకస్‌ మొత్తం సెల్ఫ్‌కేర్‌ పైనే ఉంది. నేను సంతోషంగా ఉంటూ కుటుంబానికి అన్నివిధాలా తోడుగా ఉండాలనుకుంటున్నా” అని నిహారిక చెప్పారు. మళ్లీ పెళ్లి చేసుకోవడంపై కూడా నిహారిక స్పందించారు. జీవితంలో నెక్ట్స్‌ ఏంటని హోస్ట్‌ నుంచి వచ్చిన ప్రశ్నకు నిహారిక బదులిస్తూ.. హోప్‌ ఫుల్లీ, తనకింకా 30 ఏళ్లు మాత్రమే అంటూ బదులిచ్చారు.

రెండో పెళ్లి చేసుకోవడానికి తనకేమి అభ్యంతరం లేదని, చేసుకోవద్దని బలంగా ఫిక్స్‌ అవ్వలేదనే విషయాన్ని నిహారికా స్పష్టం చేశారు. మళ్లీ పెళ్లి చేసుకుని, వివాహ బంధంలోకి అడుగుపెట్టేందుకు తాను సుముఖంగానే ఉన్నట్లు నిహారిక తెలిపింది తన హృదయాన్ని ముసివేయలేదని చెప్పి నవ్వులు పూయించారు. అలాగని పెళ్లి కోసం తాను పరుగులు పెట్టడం లేదని, ఎవర్నో చేసుకోవాలంటూ తాను పెళ్లి వెంట పడననని అన్నారు. భవిష్యత్తులో మళ్లీ పెళ్లి చేసుకుంటానని కూడా ఈ సందర్భంగా నిహారిక స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *