భర్తకి నైట్ డ్యూటీ.. అత్త కిటికీలో నుంచి చూడగా..! అందరూ షాక్!

ఎనిమిది నెలల క్రితమే ప్రేమించి పెళ్లి చేసుకున్న కర్ణాటకలోని మల్నాడుకు చెందిన నవవధువు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన దురదృష్టకర ఘటనతో అందరూ షాక్ అయ్యారు. ఈ ఘటన శివమొగ్గ జిల్లాలోని తీర్థహళ్లి తాలూకా నల్లూరు కొలిగె గ్రామ పరిధిలోని దసనకొడిగె గ్రామంలో చోటుచేసుకుంది. అయితే రాత్రి భోజనం చేసుకుని పడుకున్న కోడలు.. పొద్దున్న తలుపు ఎంత కొట్టినా తీయకపోయే సరికి అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు కిటికీలో నుండి వచ్చి చూడగా.. ఫ్యానుకు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది.

వెంటనే ఆమె పుట్టింటికి సమాచారం అందించారు. ఇంతకు ఆమె ఎందుకు ఇలా చేసిందంటే..పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని మల్నాడుకు చెందిన షమిత.. విద్యార్థి సోమేశ్వర.. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. గత మార్చిలో వీరి వివాహం జరిగింది. హాయిగా కాపురం సాగిపోతుంది. భర్త రాత్రి విధుల నిమిత్తం డ్యూటీకి వెళ్లగా.. అత్త షమితను డిన్నర్ చేసి పడుకోమని చెప్పగా.. ఆమె అలాగే చేసి.. తన గదిలోకి వెళ్లి పడుకుంది. ఉదయం తలుపులు తట్టినా తీయకపోవడంతో.. కిటీకీలో నుండి చూడగా.. షమిత.. ఉరి కొయ్యకు వేలాడుతుంది. ఆమె తల్లిదండ్రులు వచ్చాక..

తలుపులు పగుల గొట్టి చూడగా.. మృతదేహం వద్ద సూసైడ్ నోట్ ఉంది. అనారోగ్య కారణాలతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో రాసి ఉందని తెలుస్తోంది. ఈ కారణంగానే ఎంతో ప్రేమించిన భర్తను వదిలేసి.. ఆమె అనంత లోకాలకు తిరిగి వెళ్లిపోయింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. పోస్టు మార్టం నిమిత్తం షమిత.. మృతదేహాన్ని తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు. ఆమె ఆత్మహత్యకు అనారోగ్య సమస్యలా లేక.. ఇతర కారణాలున్నాయా అనే కోణంలో విచారిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *