తమిళనాడులోని వాళ్లని నైకార పట్టికి చెందిన రాజు కుమార్ చెన్నై కొడంబాకంలో ఉంటున్నాడు. అతడు అక్కడ తన తన స్నేహితుడి దగ్గర ఉంటూ అద్దెకు కారు నడుపుతుంటాడు. దాంట్లో వచ్చే ఆదాయంతోనే అతని కుటుంబాన్ని నడుపుకుంటాడు, అయితే రోజంతా పనిచేసి అలిసిపోయిన రాజ్‌కుమార్.. మధ్యాహ్నం కాసేపు నిద్రపోయాడు. ఈ క్రమంలోనే అతని మొబైల్‌కు మెజేస్ వచ్చింది.. తనకు అకౌంట్ కలిగి ఉన్న తమిళనాడ్ మర్కంటైల్ బ్యాంక్ నుండి నా ఖాతాలో డబ్బు జమ అయినట్లు మెసేజ్ వచ్చింది.
ఫస్ట్ చూడగానే.. అందులో అన్ని సున్నాలే కనిపించటంతో తాను ఆ మొత్తాన్ని లెక్కించలేకపోయానని చెప్పాడు.. అయితే, ఆ తర్వాత ట్యాక్సీ డ్రైవర్ రాజ్‌కుమార్ ఖాతాలో జమ అయిన డబ్బును డిపాజిట్ చేసిన మొత్తాన్ని బ్యాంకు విత్‌డ్రా చేసిందని చెప్పాడు. ఆ మర్నాడే.. బ్యాంకు అధికారులు సెప్టెంబర్ 10న ఆ వ్యక్తిని సంప్రదించి అకౌంట్‌లోంచి ఎక్కువ డబ్బు తీసుకోవద్దని అభ్యర్థించారు. అయితే, రాజ్‌కుమార్ రఖత్ ఖాతాలో డబ్బు జమ చేయాల్సి ఉండగా, చిన్న పొరపాటు వల్ల ట్యాక్సీ డ్రైవర్ ఖాతాలో రూ.9000కోట్లు జమైనట్టుగా బ్యాంక్ అధికారులు చెప్పారు.
రాజ్ కుమర్ ఖాతాలో డబ్బు డిపాజిట్ కావటంతో.. అతడు తన స్నేహితుడి ఖాతాకు రూ. 21,000 ట్రాన్సఫర్ చేశాడు. దాంతో విషయం గ్రహించిన బ్యాంక్ అధికారులు ఆ వెంటనే.. 30 నిమిషాల వ్యవధిలో బ్యాంక్ అతని ఖాతా నుండి బ్యాలెన్స్ విత్‌డ్రా చేసింది. రాజ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, తాను అందులోంచి ఇప్పటివరకు విత్‌డ్రా చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని బ్యాంక్ అధికారులు వెసులుబాటు కల్పించారు. పైగా, తనకు బ్యాంకు కారు లోన్ కూడా ఇచ్చేందుకు అంగీకరించినట్టుగా రాజ్‌కుమార్ చెప్పాడు.