వాస్తవానికి తలస్నానం అనేది అందరికి రోజు చేసే వీలు,వసతి కలుగదు . అలాంటి వారు వారనికి రెండు,మూడు రోజులు తలస్నానం చేసేవారికోసం ప్రత్యేకించి వారంలోని కొన్ని దినాలలో తలస్నానం చేస్తే ఆరోగ్యకరమైన శరీరం కలిగి అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. మరికొన్ని దినాల్లో తలస్నానం చేస్తే అనారోగ్యమైన పరిస్థితి మరియు ఇతర విషయలలో ప్రతికూలంగా ఉంటుంది.
కాబట్టి అన్ని విధములుగా తలంటు స్నానం ఏ రోజు చేస్తే మంచిది. తలస్నానము ఏ రోజు చేస్తే మంచిది. ఈ విషయం గురించి మనం శాస్త్రరీత్యా దీనిని పరిశీలించినట్లైతే స్నానాలు ఉదయం పూటనే చేయాలి,సూర్యోదయంనకు పూర్వం చేస్తే చాలా మంచిది.
పొద్దు పోయాక చేస్తే లేదా తిని చేస్తే అనారోగ్యం కలుగుతుంది. వృద్దులు,రోగులు ఎండ వచ్చాక చేస్తే తప్పులేదు. శరీరం సహకరించిన వారు శాస్త్రానికి విరుద్ధంగా పోతే తర్వాత కాలంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది.