నీతా అంబానీ పుట్టిన ఇళ్ళు, గ్రామం ఇదే, ఇప్పటికుడా..!

ఒక గృహిణిగా, సక్సెఫుల్‌ బిజినెస్‌ ఉమెన్‌గా నీతా అంబానీ ఎన్నో విజయాలు సాధించారు. అలాగే దాతృత్వంలో కూడా ఆమెకి సాటి లేరెవ్వరూ అని నిరూపించింది. నీతా అంబానీ చేసిన అశేష దాతృత్వ సేవలుఆమెకు దేశ విదేశాల్లో విశేషమైన కీర్తిని, గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. ఓ మహిళ ఇల్లాలిగా ఉంటూ ఎలాంటి విజయాలను అందుకోగలదు అనేందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచి నేటి యువతకు, భావితరాలను స్పూర్తిగా నిలిచింది.

అయితే ముఖేశ్ అంబానీ భార్య. రిలయన్స్ సహ సారథి. ఇప్పుడు లేటెస్ట్‌గా మోస్ట్ పవర్‌ఫుల్ ఏషియన్ బిజినెస్ ఉమన్. ‘ఫోర్బ్స్’ మేగజైన్ ఏటా విడుదల చేస్తుండే ఈ లిస్ట్‌లో తొలిసారి నీతా పేరు కనిపించింది! లిస్ట్‌లో అందరికన్న పైన నీతా కనిపించారు! లిస్టులో నీతా చాలా దేశాలను బీట్ చేశారు. చైనా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, వియత్నాం, హాంకాంగ్, జపాన్, సింగపూర్, ఫిలిప్పీన్స్, న్యూజీలాండ్.. దేశాలలో మహిళా పారిశ్రామికవేత్తలందర్నీ వెనక్కి తోసి ఫోర్బ్స్ పరుగుల పందెంలో ముందుకు దూసుకువచ్చారు!

నీతా గురించి ఫోర్బ్స్ ఏమని వ్యాఖ్యానించిందో చూడండి. ‘కోటీశ్వరుల భార్యలు… వాళ్లెంత సమర్థులైనా.. భర్తల నీడగానే మిగిలిపోతారు. నీతా అలా కాదు. ఆమె సాధించిన విజయాలన్నీ వెరీ ఇంప్రెసివ్’.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *