దక్షిణాదిసిన ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో నయనతార ముందు వరుసలో ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నాలుగు పదుల వయసులో కూడా ఇప్పటికీ అదే ఫిట్నెస్ తో దూసుకుపోతోంది ఈ స్టార్ హీరోయిన్ .పెళ్లి చేసుకుని ఇద్దరు కవల పిల్లలకు సరోగసి పద్ధతి ద్వారా తల్లి అయినప్పటికీ అదే జోరుతో వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతోంది.
దాదాపు ఏడు సంవత్సరాలు ఘాఢంగా ప్రేమించుకున్న ఈ జంట గత ఏడాది పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఇకపోతే 40 సంవత్సరాల వయసుకి దగ్గరవుతున్నా కూడా నయనతార అందం మాత్రం ఇప్పటికీ చెక్కుచెదరలేదని చెప్పాలి. ఇంత గ్లామర్ మెయింటైన్ చేయడానికి కారణం కూడా లేకపోలేదు అనే వార్తలు వినిపిస్తున్నాయి. నయనతార ప్రతిరోజు తన భర్తతో కలిసి కనీసం రెండు గంటల పాటు యోగ తప్పకుండా చేస్తుందట.
అలాగే డైట్ తో పాటు హెల్తీ ఫుడ్ కూడా తీసుకుంటుందని.. ఇక తాను ఫాలో అయ్యే డైట్ లో ప్రతిరోజు కొబ్బరినీళ్లు, జ్యూస్ తప్పనిసరిగా ఉండేలా చూసుకుంటుందని సమాచారం. ఇక భోజనం సమయంలో నాన్ వెజ్, వెజిటేబుల్స్, గుడ్లను సమపాళ్లల్లో తింటుందట. ఆయిల్ ఫుడ్ కి కంప్లీట్ గా దూరం ఉండే ఈమె వీటితోపాటు కచ్చితంగా రోజుకు 8 గంటలకు పైగా నిద్రపోతుందని.. వీటి వల్లే ఈ వయసులో కూడా ఇంత గ్లామర్ గా ఉండడానికి కారణం అని నయనతార సన్నిహితులు చెబుతున్నారు.