నదియా మళయాల, తమిళం, తెలుగు చిత్రాల్లో నటించి మెప్పించారు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో తమిళ, మళయాల భాషల్లో హీరోయిన్ గా నటించారు. సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన నదియాకు తెలుగులోనే ఎక్కువ ఆఫర్లు వచ్చాయి. అయితే నదియా .. తల్లి పాత్రలు, అక్క పాత్రలు చేస్తూ బిజీ అయిపోయింది. అయితే నదియా సినిమాల గురించి ప్రేక్షకులకు తెలుసు కానీ ఆమె పర్సనల్ లైఫ్ గురించి మాత్రం చాలా తక్కువ విషయాలు తెలుసు.
నదియా అసలు పేరు జరీనా కానీ సినిమాల్లోకి వచ్చిన తరవాత నదియాగా మార్చుకుంది. అంతే కాకుండా మాలీవుడ్ నుండి సినీప్రస్థానం మొదలుపెట్టింది. నదియా బజార్ రౌడీ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక నదియా ప్రభాస్ హీరోగా నటించిన మిర్చి సినిమాతో రీఎంట్రీ ఇవ్వగా అత్తారింటికి దారేది సినిమాతో బ్రేక్ అందుకుంది. నదియా ఫ్యామిలీ లైఫ్ విషయానికి వస్తే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
అంతే కాకుండా వారిద్దరూ కూడా అబ్రాడ్ లో చదువుకుంటున్నారు. ఇక నదియా ఏజ్ పెరిగా ఎంతో ఫిట్ గా మరియు అందంగా కనిపిస్తారు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాగా నదియా కూతుళ్లు సైతం ఎంతో అందంగా ఉన్నారు. కానీ నదియా తన కూతుళ్లను ఇండస్ట్రీకి మాత్రం పరిచయం చేయలేదు. ప్రస్తుతం నదియా తన కూతుళ్లతో కలిసి తీసుకున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.