అమీర్ పేటకు చెందిన 28 ఏళ్ల యువతితో నవ సందీప్ పరిచయం పెంచుకున్నాడు. ఆమెతో ప్రతిరోజు వాట్సాప్ చాటింగ్ చేశాడు. ఆ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం కాస్తా.. ప్రేమగా మారింది. ప్రేమ పేరుతో శారీరకంగా వాడుకున్న సందీప్.. పెళ్లి చేసుకోమని యువతి అడగ్గా తప్పించుకొని తిరుగుతున్నాడు.
అంతేకాదు ఆమెను దూరంగా పెట్టడం మొదలుపెట్టాడు. దీంతో మోసాపోయానని తెలుసుకున్న యువతి తనకు న్యాయం చేయాలని మధురానగర్ పోలీస్ స్టేషన్లో సందీప్‌పై కేసు నమోదు చేసింది. అయితే జబర్దస్త్ ఆర్టిస్ట్, సింగర్ నవ సందీప్‌పై కేసు నమోదైంది. ప్రేమ, పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పెళ్లి చేసుకోమని అడిగితే తప్పించుకు తిరుగుతున్నాడని బాధిత యువతి పేర్కొంది. యువతి ఫిర్యాదు మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఇతడు జబర్దస్త్ షోతో పాటు ఇతరత్రా షోలలోనూ కనిపించాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ, పటాస్ వంటి షోలలనూ సందీప్ పాల్గొన్నాడు. బుల్లితెర షోలలో కామెడీ పండించి నవ్వించిన సందీప్ ఇలా ఓ అమ్మాయిని మోసం చేశాడని తెలిసి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.