ప్రేక్షకులను తన నటనతో అలరించి, మెప్పించిన ఎన్టీఆర్ను ఆంధ్రులు అభిమానంగా అన్నగారు అని పిలిచేవారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత తెలుగువారి సత్తా ఢిల్లీ వరకు తెలిసేలా చేసిన ఘనత ఎన్టీఆర్ ది.
ఎన్టీఆర్ కేవలం ఒక నటుడు మాత్రమే కాదు..ప్రజలు ఎన్నటికీ మరచిపోని ఒక గొప్ప వ్యక్తి. ఎన్టీ రామారావు చీఫ్ సెక్రటరీగా పనిచేసిన నరసయ్య ఆనాడు ఎన్టీఆర్ తో తాను చూసిన కొన్ని సంఘటనలను ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో షేర్ చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో తిరుపతిలో ఎన్టీఆర్, పీఎం మధ్యలో జరిగిన ఒక సంఘటన గురించి ఆయన వివరించారు.
బీమాస్ హోటల్ రైల్వే క్రాస్ గేట్ వద్ద ఓపెన్ టాప్ జీప్ లో పీఎం వస్తుంది.. మరోపక్క క్రాసింగ్ కి అవతల ఎన్టీఆర్ తిరుపతిలో పోటీ చేస్తున్న క్యాండిడేట్గా తన ఎన్నికల ప్రచాణానికి వెళ్తున్నారు.