నారా లోకేష్ అరెస్ట్ కు వైసీపీ కుట్ర.. రంగంలోకి నారా బ్రాహ్మణి.

వైసీపీకి వ్యాపార సూత్రాలు బోధిస్తూ సిమెన్స్ మాజీ ఎండీ అన్ని అనుమానాలు నివృత్తి చేశారని తెలిపారు. ఉపాధి అవకాశాలు కాపాడేందుకు ప్రతీ ఒక్కరూ చంద్రబాబు వెంటే ఉంటున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. అయితే దురుద్దేశంతోనే టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేశారని.. ఆయన కోడలు నారా బ్రాహ్మణి ఆరోపించారు. చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బ్రాహ్మణితోపాటు భువనేశ్వరి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బ్రాహ్మణి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ప్రయోజనం కోసమే ఇలాంటి పనులు చేస్తున్నారని, చంద్రబాబు, లోకేష్ కు ప్రజల నుంచి వస్తున్న మద్దతు చూసి ఓర్వలేకపోతున్నారన్నారని విమర్శించారు. ఇళ్లు తప్ప ఎప్పుడూ బయటకు రాని తమ కుటుంబాన్ని.. నడిరోడ్డుపై నిలబెట్టారని బ్రాహ్మణి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి ఐటీ రంగాన్ని పరిచయం చేసిన ఆయనకు ఇటువంటి దుస్థితి రావడం ఘోరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కోసం పనిచేసే మహా నాయకుడును ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా.. అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.

42 సంవత్సరాల రాజకీయ జీవితంలో యువత యువకులకు అనేక ఉద్యోగాలు ఇచ్చి రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా.. కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి ప్రజలు ప్రజలు అంటూ తిరిగిన గొప్ప నాయకుడు చంద్రబాబు అన్నారు. అలాంటి వ్యక్తిపై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయడం ఏంటన్నారు. స్వచ్ఛందంగా ఇంత పెద్ద మొత్తంలో మహిళ లోకం ఈ కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొన్న అంటే చంద్రబాబుపై ప్రజలకు ఎంత అభిమానం ఉందో అర్థం చేసుకోవచ్చు అన్నారు. ఏనాడు బయటికి రాని చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు సైతం ఈరోజు రోడ్డుపై నుంచు తమకు న్యాయం కావాలి అంటూ కోరుతున్నామని నారా బ్రాహ్మణి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *