కొడాలి నాని..గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ ద్వారా విషెస్ తెలిపారని చెప్పారు.
కేసీఆర్ కు శస్త్రచికిత్స జరిగింది కాబట్టి ఆయనను సీఎం జగన్మోహన్ రెడ్డి పరామర్శించారని, రేవంత్ రెడ్డికి అలా ఏమైనా జరిగిందా అంటూ కొడాలి నాని ప్రశ్నించారు. ఫోన్ చేసి చెప్పడానికి తమ కాంగ్రెస్ పార్టీలో తాము పని చేయడం లేదని కొడాలి నాని వ్యాఖ్యానించారు. అసలు రేవంత్ రెడ్డికి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఫోన్ చేయాలని ఆయన ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డిని సీఎం జగన్ ఎందుకు కలవాలో చెప్పాలని కొడాలి నాని ప్రశ్నలు సంధించారు. రేవంత్ రెడ్డి పక్క రాష్ట్ర సీఎం అని, పట్టించుకునే సమయం జగన్మోహన్ రెడ్డికి లేదని కొడాలి నాని పేర్కొన్నారు.