ఆ వ్యాధితో నిద్రలేని రాత్రులు గడుపుతున్న హీరోయిన్‌. చివరికి కన్నీళ్లు కూడా..?

హీరోయిన్‌ నందిత..కొన్ని సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది…కెరీర్ ప్రారంభం నుండే ఆమె పక్కింటి అమ్మాయి తరహా పాత్రల్లోనే ఎక్కువగా కనిపిస్తూ వచ్చింది.ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె ఆ తర్వాత శ్రీనివాస కళ్యాణం, బ్లఫ్ మాస్టర్, ప్రేమ కథా చిత్రం 2,కల్కి, కపటదారి,అక్షర వంటి చిత్రాల్లో నటించింది. అయితే అందం, అభినయంతో ఆకట్టుకున్న నందిత త్వరలో హిడింబ తో మన మందుకు రానుంది.

అశ్విన్‌ హీరోగా నటించిన ఈ పోలీస్‌ యాక్షన్‌ డ్రామా జులై 20న విడుదల కానుంది. ఇందులో ఆద్యా అనే పవర్‌ ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించింది నందిత. ప్రస్తుతం హిడింబ ప్రమోషన్లలో పాల్గొన్న నందిత తన పర్సనల్ అండ్‌ ప్రొఫెషనల్‌ లైఫ్‌ గురించి ఆసక్తికర విషయాలు చేసుకుంది. తాను నాలుగేళ్లుగా కండరాల సమస్యతో బాధపడుతున్నానని, దీని కారణంగా వ్యాయామాలు చేయలేనంటూ నందిత చెప్పుకొచ్చింది.

హిడింబ లో ఆద్య అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నేను కనిపిస్తాను. ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డాను. నేను గత నాలుగేళ్లుగా ఫైబ్రోమైయాల్జియా అనే కండరాల రుగ్మతతో బాధపడుతున్నాను. దీని వల్ల ఎక్కువ డైట్ పాటిస్తాను. భారీ ఎక్సర్ సైజులు చేయలేను. కానీ ఈ మూవీ కోసం బరువు తగ్గాల్సి వచ్చింది. ఇందుకోసం వ్యాయామాలు చేయల్సి వచ్చింది. ఒత్తిడి, నిద్ర సరిగా లేకపోవడం వల్ల ఈ సమస్య మరింత ఎక్కువవుతుంది. అయితే హిడింబ కోసం అన్నీ భరించాను. బరువు తగ్గాను’ అని ఎమోషనలైంది నందిత. ప్రస్తుతం ఆమె కామెంట్లు వైరల్‌గా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *