అమ్మబాబోయ్.. హీరోయిన్ నమిత ఇప్పుడు ఎలా ఉందో చూశారా..? వైరల్ అవుతోన్న ఫోటోలు

2002లో వచ్చిన సొంతం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది నమిత. మొదటి సినిమాతో అందం అభినయంతో కట్టిపడేసింది నమిత.. ఈ అమ్మడు తన 17 ఏళ్ల వయసులోనే మిస్ సూరత్ గా నిలిచింది. ఆ తర్వాత చాలా యాడ్స్ లో చేసింది. ఇక సొంతం సినిమా మంచి విజయం అందుకోవడంతో తెలుగుతో పాటు, తమిళ్, కన్నడ భాషల్లోనూ అవకాశాలు అందుకుంది. వరుస సినిమాలతో బిజీగా మారిన నమిత వెంకటేష్ నటించిన జెమిని సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే గుజరాత్ లోని సూరత్ లో పుట్టింది.

1998లో మిస్ సూరత్ గా, 2001లో మిస్ ఇండియా పోటీల్లో నాలుగో స్థానంలో నిలిచింది. వెంకటేష్ హీరోగా నటించిన జెమిని సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. జెమిని సినిమాలో తన అందంతో క్యూట్ లుక్స్ తో మెస్మరైజ్ చేసింది. ఈ మూవీ తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో సొంతం సినిమా చేసింది. ఈ సినిమా విజయంతో నమితకు బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ క్యూ కట్టాయి. ఈ సినిమా తర్వాత ఒక రాజు ఒక రాణి, ఓ రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టకున్నది.

తెలుగుతో పాటు సౌత్ సినిమాల్లోనూ సినిమాలు చేసింది. అయితే అనుకోకుండా సినిమాలకు గ్యాప్ ఇచ్చింది నమిత. ఈ గ్యాప్ లో నమిత ఒక్క సారిగా బరువు పెరిగింది. 2009లో వచ్చిన బిల్లా సినిమాలో నటించింది. ఈ సినిమాలో తన అందాలతో ఆకట్టుకుంది నమిత. అలాగే 2010లో వచ్చిన సింహా చిత్రంలో నటించి మెప్పించింది. ఆతర్వాత ఈ అమ్మడు పెళ్లి పీటలెక్కింది. 2017లో నటుడు, వ్యాపారవేత్త వీరేంద్ర చౌదరిని పెళ్లి చేసుకుంది నమిత. వీరికి కవలలు పుట్టారు. ఈ విషయాన్ని 2022 ఆగస్టు 19న నమిత వెల్లడించింది.

పెళ్లి త్వరా సినిమాలకు దూరంగా ఉంటున్న నమిత సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. రకరకాల ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమె షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. బొద్దు గుమ్మ ఇంతలా మారిపోయిందేమిటి అని అందరూ ఆశ్చర్య పోతున్నారు. మళ్లీ ఒకప్పటిలా ఇంత నాజుగ్గా ఎలా మారిందబ్బా అంటూ ఆశ్చర్యపోతున్నారు ప్రేక్షకులు. ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *