తమిళ హీరోయిన.. హాట్ బ్యూటీ.. నమిత భర్త వీరేంద్ర చౌదరి ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. ఓ వ్యక్తిని మోసం చేసిన కేసులో ఆయనకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. తమిళనాడుకు చెందిన గోపాల్ స్వామి అనే వ్యక్తిని వీరేంద్ర మోసం చేశారంటూ ఆరోపణలు ఎదుర్కోంటున్నారు. అయితే తమిళనాడు మైక్రో స్మాల్, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ కౌన్సిల్ చైర్మన్ పదవి ఇప్పిస్తామంటూ ముత్తురామన్ అనే వ్యక్తి గోపాలస్వామి అనే వ్యక్తికి ఆశ చూపాడు. ఇందుకోసం గోపాలస్వామి దగ్గరి నుంచి ఏకంగా 50 లక్షల రూపాయలు వసూలు చేశాడు.
అయితే, ఆ పదవిలోకి నమిత భర్త వీరేంద్ర చౌదరి వచ్చారు. దీంతో తాను మోసపోయానని భావించిన గోపాలస్వామి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కౌన్సిల్ సెక్రటరీ దుశ్యంత్ యాదవ్, ముత్తరామన్‌లను గత నెల 31వ తేదీన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక, ఇదే కేసుకు సంబంధించి తాజాగా సేలం సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు వీరేంద్రకు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. కాగా, నమిత 2002లో వచ్చిన సొంతం సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు.
శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో నమితకు వరుస అవకాశాలు వచ్చాయి. ఒక రాజు ఒక రాణి, ఓ రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి, జెమిని, ఐతే ఏంటి? తదితర సినిమాల్లో నటించారు. 2004లో వచ్చిన ‘‘ఎంగల్ అన్న’’ సినిమాతో తమిళ ఎంట్రీ ఇచ్చారు. 2006లో ‘‘లవ్ కే చెక్కర్‌మే’’ అనే సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమాలు చేశారు. తమిళంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందారు.