అక్కినేని నాగార్జున ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, నిర్మాత, టెలివిజన్ వ్యాఖ్యాత, ఔత్సాహిక వ్యాపారవేత్త. ఇతను అక్కినేని నాగేశ్వర రావు కుమారుడు. నాగార్జున సుమారు 100 పైగా చిత్రాల్లో నటించాడు. వీటిలో ఎక్కువ భాగం తెలుగు సినిమాలు కాగా కొన్ని తమిళ, హిందీ సినిమాల్లో కూడా నటించాడు. నాగార్జున నటుడిగా, నిర్మాతగా కలిపి తొమ్మిది నంది పురస్కారాలు, మూడు దక్షిణాది ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, రెండు జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందుకున్నాడు. అయితే కృష్ణంరాజు మరణించిన సమయంలో కూడా ఎంతోమంది సెలబ్రిటీలు వచ్చినప్పటికీ..
నాగార్జున మాత్రం రాలేదు. దాసరి నారాయణరావు భార్య పద్మా మరణించిన సమయంలో మాత్రమే నాగార్జున వారి ఇంటికి వెళ్ళాడు. అది కూడా మూడవరోజు ఏదో పనిమీద వెళ్లి అక్కడ అతన్ని పలకరించి వచ్చాడు. ఇలా నాగార్జున ఎవరు మరణించిన వారి ఇంటికి వెళ్లలేదు. కానీ తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు, తల్లి అన్నపూర్ణమ్మ మరణించిన సమయంలో సినీ ఇండస్ట్రీ మొత్తం తరలి వెళ్లారు.
నాగార్జున ఎవరి ఇంటికి వెళ్లకపోయినప్పటికీ అతని కుమారులు మాత్రం ప్రతి ఒక్కరి మరణానికి హాజరయ్యేవారు. వారు ఎంత చిన్న సెలబ్రిటీ అయినా సరే వారు మరణిస్తే అక్కడికి వెళ్లి అఖిల్, నాగచైతన్య పలకరించి వచ్చేవారు. కాగా నవంబర్ 11వ తేదీన ప్రముఖ సెలబ్రిటీ చంద్రమోహన్ మృతి చెందినప్పటికీ ఎంతోమంది సెలబ్రిటీలు తరలి వెళ్లారు. నాగార్జున మాత్రం వెళ్లలేదు. నాగార్జున మరణించిన వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళడు? అని సందేహాలు ఇప్పటికి కూడా అలానే ఉండిపోయాయి. దీనిపై ఏవిధంగా నాగార్జున నోరు విప్పలేదు.