నాగార్జున మొదటి భార్యకి విడాకులు ఎందుకు ఇచ్చారో తెలిస్తే..?

విక్రమ్ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన నాగార్జున చాలా తక్కువ సమయం లోనే మన్మధుడిగా, హీరోగా, కింగ్ నాగార్జున గా పాపులారిటీని దక్కించుకున్నాడు.. ప్రస్తుతం ఒకవైపు సినిమాలు మరొకవైపు బుల్లితెర షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నాడు నాగార్జున .ఇక అప్పుడప్పుడు వాణిజ్య ప్రకటన లలో కూడా నటిస్తూ మంచి లాభాలను పొందుతున్నాడు నాగార్జున. అయితే అక్కినేని నాగేశ్వరరావు ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న సమయంలో రామానాయుడు గారితో ఎంతో మంచి పరిచయం ఏర్పడింది.

ఇలా ఈ రెండు కుటుంబాల మధ్య మంచి అవినాభావ సంబంధం ఉండటం వల్ల రామానాయుడు కుమార్తె లక్ష్మిని నాగేశ్వరరావు కుమార్తె నాగార్జునకి ఇచ్చి వివాహం చేశారు.అయితే వీరి వైవాహిక జీవితం కొన్ని సంవత్సరాలు మాత్రమే సాఫీగా కొనసాగిందని, అనంతరం వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోవడం నాగార్జున నటి అమలను పెళ్లి చేసుకోవడం జరిగింది. ఈ విధంగా నాగర్జున అమలను పెళ్లి చేసుకోవడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే…లక్ష్మి అమెరికాలో పెరగటం వల్ల ఆమె ఇండియాలో అడ్జస్ట్ కాలేకపోవడమే కారణమని సమాచారం.

అమెరికాలో పెరిగినటువంటి లక్ష్మిని రామానాయుడు ఇండియాకి రప్పించి ఉన్నఫలంగా చెన్నైలో వీరి వివాహం జరిపించారు. ఇక వీరిద్దరికీ నాగచైతన్య జన్మించిన తర్వాత ఈమె ఇండియాలో ఉండలేక నాగార్జునతో కలిసి అమెరికాలో స్థిరపడాలని కోరుకున్నారట. కానీ నాగార్జున సినిమాలతో బిజీగా ఉండటం వల్ల తాను అమెరికా రాలేరని తేల్చి చెప్పాడు. ఇలా ఈ విషయంలో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడం వల్లే విడాకులు తీసుకొని విడిపోయారని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *