నాగార్జున సినిమాలతో పాటు బిజినెస్ లు కూడా చేస్తాడు హీరో గానే కాకుండా నాగార్జున నీ మంచి బిజినెస్ మేన్ అని కూడా చెప్పచ్చు.వాళ్ళ నాన్న ఇచ్చిన అన్నపూర్ణ స్టూడియో బిజినెస్ లు మొత్తం కలిపితే నాగార్జున ఆస్తులు రూ.12వేల కోట్ల దాకా ఉన్నట్టు సమాచారం. అయితే ఒకరకంగా చెప్పాలి అంటే మల్టీ బిజినెస్ లు ఆయన సొంతం .అందుకే ఆయన ఆస్తులు, సంపాదన కూడా అందరిని ఆశ్చర్యపరిచేలా ఉంటాయి.
వాస్తవానికి హీరోగా ఆయన తీసుకునే పారితోషకం చాలా తక్కువే అయినా ఇతర మార్గాల ద్వారా ఆయనకు భారీగా ఆదాయం వస్తుందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు కేవలం రూ.10 కోట్లలోపే పారితోషకం తీసుకుంటున్న నాగార్జున ఇప్పుడు బిగ్బాస్ సీజన్ సెవెన్ కి కూడా రూ.20 కోట్లలోపే పారితోషకం తీసుకుంటున్నారు. ఏఎన్ఆర్ 3 స్టూడియోస్ ని నిర్మించారు. అందులో అన్నపూర్ణ స్టూడియో, అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్ , ఎన్ కన్వెన్షన్ సెంటర్. వీటిలో సినిమా ఓపెనింగ్లు, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, సీసీ వర్క్ జరుగుతుంటాయి.
అలాగే టీవీ షోలు కూడా చేస్తూ ఉంటారు. ఇక అన్నపూర్ణ స్టూడియోస్ లో ఫిలిం స్కూల్ ని కూడా నడిపిస్తున్నారు. వరల్డ్ క్లాస్ టెక్నాలజీ స్టాండర్డ్స్ ని అందిస్తున్నారు. వీటి ద్వారా కోట్ల రూపాయల లాభం లభిస్తుంది. అలాగే పబ్బులు హోటల్స్ కూడా రన్ చేస్తున్నారు. ఇక కార్ల విషయానికి వస్తే బీఎండబ్ల్యూ సెవెన్ సిరీస్, ఆడి ఏ7 సిరీస్, బెంజ్ కార్లతో పాటు రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కార్లు కూడా ఉన్నాయి. అంతేకాదు ఒక జెట్ కూడా ఉంది. మొత్తానికి రూ.5 వేల కోట్లకు పైగా నాగార్జున ఆస్తులు ఉన్నట్లు సమాచారం.